twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్ టాక్ తెచ్చుకున్న గుణ 369, రాక్షసుడు.. రెండో రోజే కోలుకోలేని ఎదురుదెబ్బ

    |

    గత శుక్రవారం తెలుగు చిత్ర సీమ నుంచి పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో కార్తికేయ నటించిన 'గుణ 369', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'రాక్షసుడు' హిట్ టాక్‌ను సంపాదించుకున్నాయి. ఈ రెండింటిపై తెలుగు ప్రేక్షకులు పాజిటివ్‌గా ఉండడంతో కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతున్నాయి. 'గుణ 369'తో కార్తికేయ ఖాతాలో రెండో హిట్ వచ్చి చేరింది. అలాగే, బెల్లంకొండ వారి అబ్బాయి కూడా 'రాక్షసుడు'తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. దీంతో రెండు చిత్రాల యూనిట్లు ఖుషీగా ఉన్నాయి.

    ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాలు వచ్చి 24 గంటలు గడువక ముందే ఇది ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. తమిళ రాకర్స్ వీటిని పైరసీ చేసి ఆన్‌లైన్‌లో ఉంచేసింది. వీకెండ్‌లో మంచి కలెక్షన్లు రాబట్టాలని ప్లాన్ చేసిన చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది. సినీ ఇండస్ట్రీకి 'తమిళ రాకర్స్' వరుస షాక్‌లు ఇస్తూనే ఉంది. ఇటీవల 'ఇస్మార్ట్ శంకర్', 'డియర్ కామ్రేడ్' సినిమాను కూడా ఇదే తరహాలో పైరసీ చేశారు.

     Two New Movies Leaked In Online

    సినిమా విడుదల అవడం.. 24 గంటలు గడువక ముందే పైరసీ చేసి ఆన్‌లైన్ పెట్టేయడం వంటివి చేస్తూ ఫిల్మ్ మేకర్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్. దీనిపై ఎన్ని సార్లు నిషేదం విధించినా.. సరికొత్త అడ్రెస్‌లు సృష్టించి నెటిజన్లకు దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే అన్ని భాషలకు చెందిన ఎన్నో సినిమాలను పైరసీ చేసి పెట్టేస్తున్నారు.

    కోట్లు ఖర్చుపెట్టి, వందలాది మంది కష్టంతో సినిమా తీస్తే, రిలీజ్ కాకుండానో.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని గంటల్లోనే పైరసీ కోరల్లో చిక్కుకుంటోంది. థియేటర్లలో కంటే ముందే ఇంటర్నెట్‌లో ప్రింట్‌ వచ్చేస్తోంది. ఇలా పైరసీ చేసే వాటిలో త‌మిళ రాకర్స్ ఒకటి. దీని అడ్మిన్ అయిన జాన్‌, కార్తీక్‌, ప్ర‌భుల‌ని గత సంవత్సరం పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ ఈ సైట్ రన్ అవుతుండడం గమనార్హం.

    English summary
    Piracy website TamilRockers is infamous for leaking movies on the Internet, and killing the hard work of the directors and the cast. After leaking recent releases like The Lion King and Super 30, the latest victim of the piracy website is, Rakshasudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X