twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి విరుచుకుపడిన గుణశేఖర్.. టార్గెట్ జీవిత, ప్రసన్న?

    నంది అవార్డుల్లో తనకు అన్యాయం జరిగింది అని గుణశేఖర్ అన్నారు. జ్యూరీ సభ్యుల్లో కొందరిని ముఖ్యంగా జీవిత, ప్రసన్నకుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమవుతున్నది. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

    By Rajababu
    |

    ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ నంది అవార్డులపై మరోసారి తీవ్రంగా స్పందించారు. అవార్డు జ్యూరీ సభ్యుల వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నది. ప్రధానంగా నంది అవార్డుల్లో తనకు అన్యాయం జరిగింది అని గుణశేఖర్ అన్నారు. జ్యూరీ సభ్యుల్లో కొందరిని ముఖ్యంగా జీవిత, ప్రసన్నకుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమవుతున్నది. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నంది అవార్డుల్లో తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

    నంది రాకపోవడం బాధించింది

    నంది రాకపోవడం బాధించింది

    రుద్రమదేవి సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు రాకపోయినా నేను బాధపడలేదు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ఇవ్వకపోవడం నన్ను తీవ్రంగా బాధించింది. మిగితా సినిమాలకు ఇచ్చిన అవార్డులను చూసుకొంటే ఇంకా బాధగా ఉంది.

    రుద్రమదేవీని విస్మరించడం

    రుద్రమదేవీని విస్మరించడం

    మహిళా సాధికారతను చాటే రుద్రమదేవీ చిత్రాన్ని తీసిన సినిమాకు అవార్డు ఇవ్వకపోవడం విచారకరం. అంతేకాదు, రుద్రమదేవి సినిమాకి పన్ను మినహాయింపు ఇవ్వాలని ఎంత వేడుకున్నా న్యాయం జరగలేదు. అయితే, కంచె సినిమాకు అవార్డు రావడాన్ని స్వాగతిస్తున్నాను.

    విమర్శల్లో వాస్తవం లేదు

    విమర్శల్లో వాస్తవం లేదు

    రుద్రమదేవి సినిమా కోసం పన్ను మినహాయింపుకు సరైన రితీలో దరఖాస్తు చేసుకోలేదు అని నిర్మాత ప్రసన్నకుమార్ చేసిన విమర్శల్లో వాస్తవం లేదు. పూర్తి సమాచారం తెలుసుకోకుండా దాని గురించి వ్యాఖ్యలు చేశారు. తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుండేది.

     దాసరి తర్వాత వర్మ

    దాసరి తర్వాత వర్మ

    దాసరి నారాయణ తర్వాత గొప్ప దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. ఈ జనరేషన్ దర్శకులకు రాంగోపాల్ వర్మ స్ఫూర్తి. చాలా మంది వర్మ స్కూల్ నుంచి వచ్చామని చెప్పుకోవడానికి గర్వపడుతుంటారు. నంది అవార్డులపై సెటైర్ వేసిన వర్మపై దర్శకుడు మద్దినేని రమేశ్ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు.

    రమేశ్ వ్యాఖ్యలను వెనక్కు

    రమేశ్ వ్యాఖ్యలను వెనక్కు

    వర్మ ఆయన మీదే స్వయంగా సెటైర్లు వేసుకొంటారు. దానిని సీరియస్‌గా తీసుకోకూడదు. అలాంటి వ్యక్తిపై తీవ్ర పదజాలం ఉపయోగించడం సరికాదు. రమేశ్ తన వ్యాఖ్యలను భేషరుతుగా ఉపసంహరించుకోవాలి.

    English summary
    Director Gunsekhar who has taken it too seriously. Being unhappy and irked with the AP government's double standards. Gunasekhar made some sensational comments on Nandi award Jury members. Gunasekhar raised doubts over the credibility of the members like Jeevitha and few others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X