గుణశేఖర్ 'రుద్రమదేవి' చిత్రం ప్రకటన
ప్రముఖ దర్సకుడు గుణశేఖర్ తన తదుపరి చిత్రం ప్రకటించారు. ఆ చిత్రం టైటిల్ 'రుద్రమదేవి'. ఆయన మీడియాతో మాట్లాడుతూ...''ఒక్కడు' తరవాత మొదలైన ఆలోచన 'రుద్రమదేవి'. అప్పటి నుంచీ ఈ కథపై కసరత్తు చేస్తూనే ఉన్నాను. ఇలాంటి కథను టెక్నికల్ గా అత్యున్నత విలువలతో నిర్మించాలి. అందుకే ఇంతకాలం వేచి చూశాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఈ కల త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది'' అని చెప్పారు.
ఇక 'రుద్రమదేవి' పాత్ర కోసం ఇద్దరు సౌత్ లో ఇద్దరు పెద్ద హీరోయిన్స్ ని సంప్రదించారని చెప్పారు. ఆ హీరోయిన్స్ అనుష్క, నయనతార అని తెలిసింది. అలాగే వీరిద్దరి తో పాటు ప్రియాంక చోప్రాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే నయనతారే ఖాయిం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక నిప్పు చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రవితేజ హీరోగా వైవియస్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











