తెలుగు తెరపై మరో రూ. 150 కోట్ల భారీ ప్రాజెక్ట్ ‘హిరణ్యకశిప’

By Bojja Kumar

తెలుగు తెరపై మరో భారీ బడ్జెట్ ప్రాజుక్ట్ రూపొందబోతోంది. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన బిగ్ బడ్జెట్ మూవీ 'బాహుబలి'. రెండు పార్టులుగా వచ్చిన ఈచిత్రానికి రూ. 250 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. తాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రానికి రూ. 150 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. త్వరలో రూ. 150 కోట్ల బడ్జెట్‌తో మరో మూవీ రాబోతోంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట.

Recommended Video

Rana Daggubati's Next Film Details Here చరిత్ర తిరుగరాసే పాత్రలో రానా..
గుణశేఖర్ మరో భారీ ప్రాజెక్ట్

గుణశేఖర్ మరో భారీ ప్రాజెక్ట్

'రుద్రమదేవి' లాంటి భారీ చారిత్రక చిత్రంతో గుణశేఖర్ తన సత్తాచాటకున్నారు. ఈ చిత్రం ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకుంది. త్వరలో గుణశేఖర్ 'హిరణ్యకశిప' అనే పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

భారీతనం కోసమే రూ. 150 కోట్ల బడ్జెట్

భారీతనం కోసమే రూ. 150 కోట్ల బడ్జెట్

పౌరాణిక చిత్రం అంటే భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్‌ అవసరం ఉంటుంది. ఇందుకోసం అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. తెరపై ఇది గ్రాండియర్‌గా సినిమాను ప్రజెంట్ చేయాలంటే రూ. 150 కోట్ల అవసరం అని భావించే అన్ని సెట్ చేసుకుని రంగంలోకి దిగాడు గుణశేఖర్.

 హిరణ్యకశిపుడుగా రానా

హిరణ్యకశిపుడుగా రానా

'భక్త ప్రహ్లాద' కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతుందని, అయితే ఇది హిరణ్యకశిపుడి కోణంలో కొనసాగుతుందని సమాచారం. బాహుబలిలో భల్లాలదేవ పాత్ర పోషించిన రానా ఈ చిత్రంలో హిరణ్యకశిపుడుగా నటించనున్నారు.

సెట్స్ మీదకు ఎప్పుడంటే

సెట్స్ మీదకు ఎప్పుడంటే

ఈ చిత్రం ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గుణ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించనున్నారని తెలుస్తోంది.

మూడు భాషల్లో గ్రాండ్‌గా

మూడు భాషల్లో గ్రాండ్‌గా

రూ. 150 కోట్ల బడ్జెట్ భరించడం అంటే కేవలం టాలీవుడ్ వల్ల కాదు. అందుకే ఈచిత్రాన్ని హిందీ, తమిళంలో కూడా తెరకెక్కించి.... జాతీయ స్థాయి ప్రాజెక్టుగా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X