కళ్యాణ్ రామ్ కత్తి టైటిల్ పై గుణశేఖర్ మండిపాటు

By Pratap

టాలీవుడ్ లో మరో టైటిల్ వివాదం నెలకొంది. మహేష్ ఖలేజా వివాదం మరిచిపోక ముందే ఈ వివాదం ముందుకు వచ్చింది. కళ్యాణ్ రామ్ కత్తి టైటిల్ పై దర్శకుడు గుణశేఖర తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాను మూడేళ్ల క్రితం ఆ టైటిల్ ను రిజిష్టర్ చేశానని, ఇప్పుడు దానికి కళ్యాణ్ రామ్ అనే తోక తగిలించి వాడుకోవడం సరి కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. టైటిళ్లకు తోకలు తగిలించి వాడుకోవడం ఎంత వరకు సమంజసమని ఆయన అడిగారు. రవితేజను దృష్టిలో పెట్టుకుని తాను ఆ టైటిల్ ను నమోదు చేశానని, రవితేజ వంటి మాస్ హీరో కు చాలా నప్పుతుందనే ఉద్దేశంతో ఆ పని చేశానని ఆయన చెప్పారు. కళ్యాణ్ రామ్ పదాన్ని కూడా కత్తి స్థాయిలో రాసుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని ఆయన చెప్పారు.

చిత్రానికి టైటిల్ మకుటం వంటిదని, చిత్ర విజయంలో టైటిల్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. టైటిళ్లకు తోకలు పెట్టి వాడుకోవడం విషవృక్షంలా మారిందని ఆయన విమర్శించారు. దర్శక, నిర్మాతలను తాను ఈ విషయం అడిగానని, వారి నుంచి స్పందన లేదని ఆయన చెప్పారు. తాను రచ్చ చేయదలుచుకోలేదని, బాధతోనే మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. ఇంతకు ముందు మహేష్ బాబు ఖలేజా టైటిల్ పై కూడా వివాదం చెలరేగి కోర్టుకెక్కింది. మహేష్ ఖలేజా టైటిల్ కు కోర్టు అనుమతిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X