Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రానాతో గుణశేఖర్ ‘హిరణ్యకశిప’... రూ. 180 కోట్ల భారీ బడ్జెట్!
Recommended Video
'రుద్రమదేవి' లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత దర్శకుడు గుణశేఖర్ 'హిరణ్యకశిప' మూవీ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఈ మైథలాజికల్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో గుణశేఖర్ బిజీ బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని రానా తండ్రి, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు నిర్మించబోతున్నారు. తాజాగా ఈ మూవీకి ఎంత బడ్జెట్ ఖర్చు చేయబోతున్నారనే విషయం బయటకు వచ్చింది.
రూ. 180 కోట్ల భారీ బడ్జెట్
మైథలాజికల్
సినిమా
అంటే
భారీ
సెట్టింగులు,
గ్రాఫిక్స్
తప్పనిసరి.
మామూలు
బడ్జెట్లో
ఇలాంటి
సినిమా
చేయడం
అసాధ్యం.
తాజాగా
అందుతున్న
సమాచారం
ప్రకారం
ఈ
సినిమా
కోసం
రూ.
180
కోట్లు
ఖర్చు
చేయబోతున్నట్లు
తెలుస్తోంది.
వైకుంఠం, ఇంద్రలోకం సెట్లు
సినిమాలో
వైకుంఠం,
ఇంద్రలోకం
లాంటి
సెట్లు
ఇప్పటి
వరకు
ప్రేక్షకులు
ఏ
సినిమాలోనూ
చూడని
స్థాయిలో
వేస్తున్నారట.
ఇందుకు
సంబంధించిన
స్కెచ్
డిజైన్స్
ప్రముఖ
ఆర్టిస్ట్
ముఖేష్
సింగ్
ఆధ్వర్యంలో
రూపొందుతున్నాయని
సమాచారం.
స్పెషల్ ఎట్రాక్షన్ నరసింహుడి అవతారం
ఈ చిత్రంలో నరసింహుడి అవతారం స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతోందని, ఈ పాత్రకు సంబంధించిన రూపాన్ని వెండితెరపై చూపి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన డిజైన్స్ విడుదల చేసే అవకాశం ఉంది.
విఎఫ్ఎక్స్ కోసం భారీ ఖర్చు
ఈ సినిమాలో టాప్ క్లాస్ విఎఫ్ఎక్స్ కోసం భారీ గా ఖర్చు పెడుతున్నారు. తెరపై సినిమా చూసే సమయంలో ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యేలా గ్రాఫిక్స్ ఉండబోతున్నాయట. తెలుగు, తమిళం, హిందీలో ఈ సినిమా విడుదల చేయనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.