అంతటి దుర్మార్గుడు గుణశేఖర్: మల్లెమాల పుస్తకంపై మొదలైన మరో గొడవ

సీనియర్ డైరెక్టర్ మల్లెమాల ఎం.ఎస్.రెడ్డి "ఇది నా కథ" పుస్తకం చదివిన గుణశేఖర్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా స్పందించాడు అయితే ఘాటుగా కాదు గానీ కాస్త వెటకారంగానే తన రియాక్షనేంటో చెప్పాడు.

Recommended Video

గుణశేఖర్ అంత దుర్మార్గుడా ?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డ్స్‌పై నిరసన జ్వాలలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. నంది అవార్డులపై రగడ నడుస్తూనే ఉంది. తమ చిత్రానికి నంది పురస్కారం దక్కకపోవడంతో దర్శకుడు గుణశేఖర్‌ జ్యూరీపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

జ్యూరీ సభ్యులు కూడా

జ్యూరీ సభ్యులు కూడా

మరోపక్క జ్యూరీ సభ్యులు కూడా సోషల్‌ మీడియాలో తమను విమర్శించే వారిపై ఎదురుదాడికి దిగారు. దీంతో నందుల వివాదం మరింతగా ముదురుతోంది. ఆ వివాదం ఇప్పుడు ఇంకో కొత్త రూట్లోకి మారింది. గుణశేఖర్ సోషల్ మీడియాలో సడెన్ గా తెలుగువారి ఆరాధ్య నటుడు ఎన్.టి.రామారావు ప్రస్తావన తీసుకొచ్చాడు.

 మల్లెమాల ఎం.ఎస్.రెడ్డి

మల్లెమాల ఎం.ఎస్.రెడ్డి

ఆ మధ్య నిర్మాత మల్లెమాల ఎం.ఎస్.రెడ్డి ఇది నా కథ పేరుతో తన జీవిత చరిత్ర రాశారు. ఇందులో గుణశేఖర్ తనకు ఎలా పరిచయమైంది.. ఆ పరిచయం ఎలా పెరిగింది రాసుకొచ్చారు. కెరీర్ లో పైకెదిగాక గుణశేఖర్ తన పట్ల చాలా అవమానకరంగా వ్యవహరించాడని డైరెక్ట్ గానే రాశారు.

 వెటకారంగానే చెప్పాడు

వెటకారంగానే చెప్పాడు

ఇదే పుస్తకంలో తెలుగువారి ఆరాధ్య నటుడు ఎన్.టి.రామారావు తన ఖర్చులన్నీ ఎదుటివారి నెత్తిన వేసేవారంటూ ఓ ఆర్టికల్ కూడా రాశారు. అయితే ఈ ఆర్టికల్ చదివిన గునశేఖత్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా స్పందించాడు అయితే ఘాటుగా కాదు గానీ కాస్త వెటకారంగానే తన రియాక్షనేంటో చెప్పాడు.

నేను నిజమని సమర్ధించను

నేను నిజమని సమర్ధించను

తనగురించి మల్లెమాల రాసిన పేజీలను.. అండర్ లైన్ చేసి మరీ షేర్ చేసిన గుణశేఖర్ "ఈ నిందల్ని నిజం అని కొందరు ‘తమ్ముళ్ళు' సమర్ధించవచ్చేమో గానీ ఇదే పుస్తకంలో ‘అన్నగారి'పై వచ్చిన నిందల్ని నేను ఏమాత్రం నిజమని సమర్ధించను" అంటూ చిన్నపాటి చురక వేశాడు.

 కొత్త స్టయిల్లో కౌంటర్

కొత్త స్టయిల్లో కౌంటర్

ఇంతవరకు తన సినిమా గురించో.. అవార్డుల గురించో మాట్లాడిన గుణశేఖర్ ఉన్నట్టుండి ఎన్టీఆర్ ను ఎందుకు అటాక్ చేస్తున్నాడో అభిమానులకు ఓ పట్టాన అర్ధం కాలేదు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్లను దృష్టిలో పెట్టుకుని గుణశేఖర్ ఓ కొత్త స్టయిల్లో కౌంటర్ ఇస్తున్నాడని అర్ధమై ఫ్యాన్స్ కూడా తిరిగి కామెంట్లతో ఎదురుదాడి మొదలెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X