గుణశేఖర్ సినిమాకు రూ.25 కోట్లు!!
సినిమా పరిశ్రమలో తలా ఒకదారి. ఒకాయన కొత్తవారిని ఆదరిస్తానంటే మరొకాయన పాతవారే నా దారి అంటారు. ఏమన్నా అది వార్తే. ఇపుడు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూడా ఒక ప్రకటన చేశాడు. కొత్తవారితో సినిమాలు చేయనని. తన తదుపరి సినిమాను పెద్ద స్టార్లతోనే తీస్తానని అంటున్నాడు. గత పది నెలలుగా స్ర్కిప్ట్ పనిలో ఉన్న గుణశేఖర్ దానిని పూర్తిచేశాడు. ఈ స్క్రిప్ట్ తో సినిమా తీస్తే రూ.25 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందట. ఈ స్క్రిప్ట్ హాలీవుడ్ సినిమాకు మల్లే ఉంటుందట. ఒక్కడు, చూడాలని ఉంది లాంటి సూపర్ డూపర్ హిట్లను అందించిన గుణశేఖర్ అలాంటిదే మరొకటి ఇవ్వాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











