వివి వినాయిక్ కి క్షమాపణ చెప్పిన గుణశేఖర్
"వివి వినాయిక్ గతంలో "కత్తి" టైటిల్ నాకు ఇమ్మని అడిగారు. అయితే నా దగ్గర సరపడ కథ ఉంది కాబట్టి ఇవ్వలేనని చెప్పేసారు. దాంతో ఆయన తన సినిమాకు కృష్ణ అని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇవివి సత్యనారాయణ తన కుమారుడు చిత్రం కోసం అడిగారు. కానీ అప్పుడూ అదే సమాధానం చెప్పాను. అయితే ఇప్పుడా టైటిల్ నాకు కాకుండా పోయింది. ఆ రోజు వారు అడిగినప్పుడు ఇవ్వనందుకు వారిని క్షమాపణ చెప్తున్నాను" అన్నారు ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్. గత కొద్ది రోజులుగా కత్తి టైటిల్ వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ తన చిత్రానికి కత్తి అనే టైటిల్ పెట్టుకుని రిజిస్టర్ చేసుకున్న గుణశేఖర్ కి ట్విస్ట్ ఇచ్చారు. గుణశేఖర్...ఫిల్మ్ ఛాంబర్ ని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దాంతో విసిగిన ఆయన ఇలా స్పందించారు. తను ఆ టైటిల్ ని హుందాగా వదిలేసుకుంటున్నట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు.


Click it and Unblock the Notifications











