‘నిప్పు’ వేడి ఇంతేనా, గుర్రుగా ఉన్న గుణశేఖర్?

By Bojja Kumar

మాస్ మహారాజ రవితేజ హీరోగా గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నిప్పు'. దీక్షా సేథ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. వైవిఎస్ చౌదరి బొమ్మరిల్లు పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియోకి సంబంధించిన ప్లాటిన్ డిస్క్ ఫంక్షన్ ఈ రోజు(ఫిబ్రవరి 3)న జరుగనుంది. శివరాత్రిని పురస్కరించుకని ఫిబ్రవరి 17న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే విడుదలకు ముందుకు 'నిప్పు' సినిమా ప్రేక్షకుల్లో అనుకున్నంత వేడిని పుట్టించక పోవడంపై దర్శకుడు గుణశేఖర్ అసంతృప్తిగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్ర నిర్మాత వైవిఎస్ చౌదరి సినిమా పబ్లిసిటీపై సరైన దృష్టి పెట్టడం లేదని, ఇలా అయితే సినిమా ఓపెనింగ్స్ పడిపోతాయి, అనుకున్న అంచనాలను అందుకోక పోవచ్చు అని ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.

రవితేజ ఈ సినిమాలో సూర్య పాత్రలో నటిస్తున్నాడు. ఎలాంటి బాధ్యతలు లేని, ఎలాంటి లక్ష్యాలేని జులాయిలా ఉంటాడు. అయితే ఉన్నట్టుండి అతనిపై పెద్ద బాధ్యత వచ్చి పడుతుంది. ఈ క్రమంలో సినిమా ఆసక్తికరంగా సాగుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: తమన్, నిర్మాత: వైవిఎస్ చౌదరి, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : గుణశేఖర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X