twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి గొంతుకే ఇన్ని ప్రశంసలు వస్తే.. మరి నటనకు..

    By Srikanya
    |

    హైదరాబాద్‌: 'రుద్రమదేవి'లో మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌కే ఇన్ని ప్రశంసలు వస్తే... మరి దాదాపు ఒక దశాబ్దం తరువాత వస్తున్న ఆయన అతిథి పాత్రకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు... అని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ అన్నారు.

    చిరు1

    ఈనెల 9న విడుదలైన 'రుద్రమదేవి' చిత్రంలో చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకుగానూ ఆయనకు పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై గుణశేఖర్‌ తన అభిప్రాయాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

    If his voice-over alone could garner such roaring applause for a film like 'Rudhramadevi' .. can't wait to see the magic his cameo does in 'Bruce Lee' !

    Posted by Rudhramadevi on14 October 2015

    చాలా కాలం తరువాత చిరంజీవి తెరపై కనిపించనున్న 'బ్రూస్‌లీ' చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'బ్రూస్‌లీ' చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ... చిరంజీవి పోస్టర్‌ను పోస్ట్‌ చేశారు.

    అనుష్క, అల్లు అర్జున్‌, రానా, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో కాకతీయ వీర వనిత రుద్రమదేవి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న 'రుద్రమదేవి' చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే.

    అనుష్క్ టైటిల్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి' తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద కూడా మంచి ఫలితాలు రాబడుతోంది. సినిమా విడుదలైన తొలి వారాంతంలో ఇంప్రెసివ్ కలెక్షన్స్ రాబట్టింది.

    మూడు రోజుల్లో కేవలం తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ రూ. 25 కోట్లకు పైగా షేర్ సాధించి తెలుగులో టాప్ 3 చిత్రంగా నిలిచింది. ఈచిత్రానికి సంబంధించిన మూడు రోజు కలెక్షన్ వివరాలు ఏరియా వైజ్ వివరాలు నిర్మాతలు విడుదల చేసారు. హిందీలో కూడా ఈ సినిమా విడుదలైంది. ఈ మొత్తం కలిసి రూ. 32 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

    RUDHRAMA DEVI

    ఈ చిత్రంలో రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ హైలెట్. చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, నాగదేవునిగా బాబా సెహగల్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, టిట్టిబిగా వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా అజయ్ నటించారు.

    ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.

    English summary
    Guna Shekar Shared in FB: " If his voice-over alone could garner such roaring applause for a film like 'Rudhramadevi' .. can't wait to see the magic his cameo does in 'Bruce Lee' !"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X