For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్యాణ్ రామ్ 'కత్తి' తో గుణశేఖర్ ని పొడిచారు

    By Srikanya
    |

    'కత్తి' చిత్రం వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. తాజాగా దర్శకుడు గుణశేఖర్ ఈ విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదనను వెళ్ళబుచ్చారు. ఆయన మాట్లాడుతూ...ఈ కథ, టైటిల్ విని ఎంతో ఇన్‌స్పైర్ అయి రవితేజ సినిమా చేయడానికి అంగీకరించారని, అయితే ఇంతలోనే మరో హీరో పేరుని తగిలించుకుని కత్తి పేరుతో మరో సినిమా వస్తుండటం చూసి షాక్ అయ్యానని గుణశేఖర్ చెప్పారు. పైగా దీని వల్ల ఆడియన్స్‌లో కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుందని అన్నారు.

    అలాగే ' అల్లు అర్జున్‌తో సినిమా చేయబోయే ముందు 'కత్తి', 'వరుడు' కథలు రెండూ చెప్పాను. అయితే ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయాలనే ఆలోచనతో అర్జున్ ఉండటంతో 'వరుడు' చిత్రం చేశాం. అప్పుడు ఆ చిత్రనిర్మాత దానయ్యగారితో 'కత్తి' టైటిల్‌ను రిజిష్టర్ చేయమని, ఆ టైటిల్‌ని తర్వాత వాడుకుంటానని చెబితే ఆయన తన బేనరుపై ఆ టైటిల్ రిజిస్టర్ చేశారు. అయిదు నెలల క్రితం వేరే కంపెనీ మేనేజర్ ఫోన్ చేసి టైటిల్ కావాలని అడిగాడు. ఆ టైటిల్‌తో నేను సినిమా ప్రారంభిస్తున్నాను కనుక ఇవ్వలేనని చెప్పేశాను. ఆ తర్వాత వాళ్ల నుంచి నాకు ఎలాంటి ఫోన్ లేదు.

    ఇంతలో 'కత్తి' టైటిల్‌కు ముందు ఆ చిత్ర హీరో పేరుని తగిలించి ఆ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిసి షాక్ అయ్యాను. నా అనుమతి లేకుండా నా టైటిల్‌ను అలా వాడుకోవడం ఎంత వరకూ సబబు? సాధారణంగా రిజిస్టర్ చేసిన టైటిల్‌ను పోలి ఉండే మరో టైటిల్‌ను రిజిస్టర్ చేసేముందు మొదట రిజిస్టర్ చేసిన వ్యక్తి అనుమతి తీసుకోవడం పద్ధతి. కానీ వాళ్లు అలా చెయ్యలేదు. మా పి.ఆర్.వో. ద్వారా వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నించాను. ఛాంబర్ మా టైటిల్‌ను ఓ.కె. చేసింది కనుక ఇంక మాట్లాడటానికి ఏమీ లేదని వాళ్ల నుంచి సమాధానం వచ్చింది. ఆ విషయమై వివరణ కోరుతూ ఛాంబరు పెద్దల్ని అడిగితే కమిటీలో అధిక శాతం మంది ఆ టైటిల్‌ను ఓ.కె. చెయ్యడంతో అనుమతి ఇచ్చామని వారు సమాధానం చెప్పారు. అలా అంటే ఇక టైటిల్ ముందుగా రిజిస్టర్ చేసుకోవడంలో అర్ధమేమి ఉంటుంది? పరిశ్రమకి ఇది మంచి పద్దతి కాదని పేర్కొంటూ ఛాంబర్‌కు లెటర్ రాశాను. దానికి సమాధానం లేదు.

    హీరో పేరు చిన్నగా వేసి 'కత్తి' అనే టైటిల్ ఫాంట్ బోల్డ్‌గా పెట్టకుండా లోగా ఫాంట్ ఒకేలా ఉండేలా చూడమని కూడా ఆ కంపెనీ నిర్వాహకులను అడిగాను. దానికి కూడా వారి నుంచి సరైన స్పందన రాలేదు. మేం రిజిస్టర్ చేసిన 'కత్తి' టైటిల్‌కు ఇలా డామేజ్ జరుగుతున్నా కోర్టుకి వెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని అనుకోవడం లేదు. ఈ విషయంలో ఛాంబర్ నాకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నాను' అన్నారు గుణశేఖర్. ఇక 'కత్తి' టైటిల్ తనదని, ఈ విషయంలో తలెత్తిన వివాదంలో ఫిలిం ఛాంబరు తనకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు దర్శకుడు గుణశేఖర్ చెప్పారు. రవితేజ హీరోగా తన దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని, అయితే విజయదశమి నుంచి యువన్‌శంకర్‌రాజా సంగీత దర్శకత్వంలో మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X