‘గుండె జారి గల్లంతయ్యిందే’లో జాయినైన నిత్యా మీనన్
హైదరాబాద్: హీరో నితిన్‌కు పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి వీరాభిమానమో అందరికీ తెలిసిందే. తాజాగా నితిన్.. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ హిట్ 'గబ్బర్ సింగ్' చిత్రంలోని సూపర్ హిట్ పాటలోని ఓ పల్లవి 'గుండె జారి గల్లంతయ్యిందే'ని టైటిల్‌గా పెట్టుకొని ఓ సినిమా చేస్తున్నాడు.
'ఇష్క్' చిత్రంలో తనతో జోడి కట్టిన నిత్య మీనన్‌తో నితిన్ మరోసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇషా తల్వార్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. 'ఇష్క్'కు విజయవంతమైన పాటలను అందించిన అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా విజయ్ కుమార్ కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఈ చిత్రం షూటింగ్ గత నెలలోనే ప్రారంభం అయింది. నితిన్, ఇషా తల్వార్ లపై కొన్ని సీన్లు చిత్రీకరించారు. తాజాగా నిత్యా మీనన్ కూడా షూటింగులో జాయిన్ అయింది. ఈ చిత్రం షూటింగ్ తర్వగా పూర్తి చేయడానికి దర్శక నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేసారు. 2013లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో వైపు నిత్యా మీనన్ నటించిన 'ఒక్కడినే'చిత్రం ఈ నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. నారా రోహిత్ కథానాయకుడుగా, శ్రీనివాస రాగ దర్శకత్వంలో నిర్మాత సి.వి.రెడ్డి గులాబీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న'ఒక్కడినే' చిత్రాన్ని నవంబర్ 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











