నితిన్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఆడియో డేట్
హైదరాబాద్ : నితిన్, నిత్యమీనన్ జంటగా విక్రమ్ గౌడ్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'గుండెజారి గల్లంతయ్యిందే'. విజయకుమార్ కొండా దర్శకుడు. ఇషా తల్వార్ మరో నాయికగా నటిస్తోంది. చిత్రీకరణ కంప్లీట్ చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో విడుదల తేదీ కూడా ఖరారైంది.
మార్చి 27న హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఆడియో విడుదల కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా ఏప్రిల్ 19న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత నిఖితారెడ్డి మాట్లాడుతూ...'గుండెజారి గల్లంతయ్యిందే సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వండర్‌ఫుల్ టీమ్ వర్క్ చేస్తోంది.
'ఇష్క్' లాంటి హిట్ అనంతరం మళ్ళీ మా బ్యానర్ ద్వారా ఓ చక్కని కుటుంబ కథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నాం. నితిన్-నిత్యల కెమిస్ట్రీ మరో మారు బాక్సాఫీస్ వద్ద టాప్ ప్లేస్‌లో నిలబెడుతోంది. అలాగే గుత్తా జ్వాల చేసిన సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుంది. హాట్ సీజన్‌లో వస్తోన్న ఈ సినిమా కూల్ ఎంటర్‌టైనర్‌గా ఉండటం ఖాయ'మని అన్నారు.
మధునందన్, అలీ, ఆహుతి ప్రసాద్, సంధ్య జనక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: కృష్ణచైతన్య, సినిమాటోగ్రఫీ: ఆండ్రూ బాబు, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, కొరియోగ్రఫీ: శేఖర్, మాటలు-స్క్రీన్‌ప్లే: హర్షవర్దన్, ఆర్ట్: రాజీవ్‌నాయర్, సమర్పణ: విక్రమ్‌గౌడ్.


Click it and Unblock the Notifications











