ఫోటోలు: ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఏప్రిల్ 19న
హైదరాబాద్: నితిన్, నిత్య మీనన్ జంటగా విక్రమ్ గౌడ్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'గుండెజారి గల్లంతయ్యిందే'. విజయకుమార్ కొండా దర్శకుడు. ఇషా తల్వార్ మరో నాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదలకు సిద్దం అవుతోంది.
ఈ చిత్రం గురించి నిర్మాత నిఖితారెడ్డి మాట్లాడుతూ... 'గుండెజారి గల్లంతయ్యిందే సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే విడుదలైన పాటలకు అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆడియో విజయాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న వరంగల్ లోని ఏషియన్ శ్రీదేవి మాల్‌లో ప్లాటినం డిస్క్ వేడుకలను జరుపనున్నామని తెలిపారు.
ఈ చిత్రానికి వండర్‌ఫుల్ టీమ్ వర్క్ చేస్తోంది. 'ఇష్క్' లాంటి హిట్ అనంతరం మళ్ళీ మా బ్యానర్ ద్వారా ఓ చక్కని కుటుంబ కథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నాం. నితిన్-నిత్యల కెమిస్ట్రీ మరో మారు బాక్సాఫీస్ వద్ద టాప్ ప్లేస్‌లో నిలబెడుతోంది. అలాగే గుత్తా జ్వాల చేసిన సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుంది. హాట్ సీజన్‌లో వస్తోన్న ఈ సినిమా కూల్ ఎంటర్‌టైనర్‌గా ఉండటం ఖాయ'మని అన్నారు.

ఈ చిత్రంలో ఇంకా మధునందన్, అలీ, ఆహుతి ప్రసాద్, సంధ్య జనక్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: కృష్ణచైతన్య, సినిమాటోగ్రఫీ: ఆండ్రూ బాబు, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, కొరియోగ్రఫీ: శేఖర్, మాటలు-స్క్రీన్‌ప్లే: హర్షవర్దన్, ఆర్ట్: రాజీవ్‌నాయర్, సమర్పణ: విక్రమ్ గౌడ్.

గుండెజారి గల్లయిందే చిత్రంలో నితిన్, నిత్య మీనన్.

గుండెజారి గల్లయిందే చిత్రంలో నితిన్, నిత్య మీనన్.

గుండెజారి గల్లయిందే చిత్రంలో నితిన్, నిత్య మీనన్.

గుండెజారి గల్లయిందే చిత్రంలో నితిన్, నిత్య మీనన్.

గుండెజారి గల్లయిందే చిత్రంలో నితిన్, నిత్య మీనన్.

గుండెజారి గల్లయిందే చిత్రంలో నితిన్, నిత్య మీనన్.


Click it and Unblock the Notifications











