కుర్రహీరో హిట్ ఫార్ములా: కామెడీ విత్ పవన్ మేనియా
హైదరాబాద్: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నడుస్తున్న హిట్ ఫార్మాలా.... ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్. సినిమాలో ఏమున్నా లేక పోయినా బోరింగ్ లేకుండా కామెడీ టచ్ ఇస్తే సినిమా మినిమమ్ గ్యారంటీ. అందుకే టాప్ హీరోలంతా ప్రస్తుతం తమ సినిమాల్లో కామెడీ పార్టుకు ప్రత్యేక స్థానం కల్పించడంతో పాటు తాము కూడా కమెడియన్లుగా మారిపోతున్నారు. ఇక స్టార్ హీరో మేనియా కూడా సినిమాకు జోడైతే హిట్ గ్యారంటీ.
చాలా లేటుగా హిట్ ఫార్ములా ఏంటో తెలుసుకున్న కుర్ర హీరో నితిన్ తన తాజా సినిమా 'గుండె జారి గల్లంతయ్యిందే'లో ఇదే ఫార్మాలను అప్లై చేస్తున్నాడు. సినిమాలో కామెడీకి పెద్ద పీఠ వేయడంతో పాటు తాను అభిమానించే, తెలుగు నాట ఎక్కువ ఆదరణ కలిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియాను తన సినిమాలో జోప్పించాడు.
పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రంలోని దిల్ సే సాంగులోని లిరిక్ ను తన సినిమాకు టైటిల్ గా చేసుకోవడంతో పాటు, పవన్ నటించిన 'తొలి ప్రేమ' చిత్రంలోని 'నీ మనసే' సాంగును తన సినిమాలో రీమిక్స్ సాంగుగా చేస్తున్నాడు. నితిన్, నిత్య మీనన్, ఇషా తల్వార్ జంటగా విక్రమ్ గౌడ్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదలకు సిద్దం అవుతోంది.
ఈ సినిమా గురించి నితిన్ మాట్లాడుతూ... గుండెజారి గల్లంతయ్యిందే చిత్రం రొమాంటిక్ కామెడీ అంశాలతో కలగలిపిన డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ప్రేక్షకులకు కలిగిస్తుందని వెల్లడించారు. మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

గుండెజారి గల్లంతయ్యిందే చిత్రానికి కథ, దర్శకత్వం విజయ్ కుమార్ కొండ. నితిన్ సోదరి నిఖాతారెడ్డి ఈచిత్రానికి నిర్మాత.

ఈ సినిమా వ్యవహారాలు తన సోదరి దగ్గరుండి చూసుకుంటూ ఎంతో నిబద్ధదతో పని చేస్తుందని నితిన్ తెలిపారు.

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా ఈచిత్రంలో స్పెషల్ సాంగులో నర్తించింది.

ఇష్క్ చిత్రంలో నితిన్, నిత్యా మీనన్ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో ఈ జంట మరోసారి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

‘తొలి ప్రేమ' చిత్రంలోని ‘నీ మనసే' సాంగును తన సినిమాలో రీమిక్స్ సాంగుగా చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: కృష్ణచైతన్య, సినిమాటోగ్రఫీ: ఆండ్రూ బాబు, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, కొరియోగ్రఫీ: శేఖర్, మాటలు-స్క్రీన్‌ప్లే: హర్షవర్దన్, ఆర్ట్: రాజీవ్‌నాయర్, సమర్పణ: విక్రమ్ గౌడ్.


Click it and Unblock the Notifications











