నితిన్-నిత్య ‘గుండె జారి గల్లంతయ్యిందే’(న్యూ ఫోటోస్)
హైదరాబాద్: నితిన్, నిత్యా మీనన్ జంటగా 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా విజయ్ కుమార్ కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుధాకర్ రెడ్డి నిర్మాత. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
బేసిక్‌గా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్, పవన్ లేటెస్ట్ హిట్ 'గబ్బర్ సింగ్' చిత్రంలోని ఓ పాటలోని లిరిక్ అయిన 'గుండె జారి గల్లంతయ్యిందే'ని టైటిల్‌గా పెట్టుకొని ఈ సినిమా చేస్తున్నాడు. 'ఇష్క్' చిత్రంలో తనతో జోడి కట్టిన నిత్య మీనన్ నితిన్‌తో కలిసి మరోసారి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనుంది.
ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే... బ్యాట్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా ఈచిత్రంలో ప్రత్యేక గీతం(ఐటం సాంగ్)లో కనిపించనుంది. ఈ సినిమాతో ఆమె సినిమా రంగంలోకి ఎంటరవుతోంది. ఈ విషయాన్ని జ్వాలా గుత్త ఇటీవల స్వయంగా వెల్లడించింది.

నితిన్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ‘గుండెజారి గల్లంతయ్యిందే' న్యూ ఫోటోలు విడుదలయ్యాయి.

బేసిక్‌గా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్, పవన్ లేటెస్ట్ హిట్‘గబ్బర్ సింగ్' చిత్రంలోని ఓ పాటలోని లిరిక్ అయిన ‘గుండె జారి గల్లంతయ్యిందే'ని టైటిల్‌గా పెట్టుకొని ఈ సినిమా చేస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే...బ్యాట్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా ఈచిత్రంలో ప్రత్యేక గీతం(ఐటం సాంగ్)లో కనిపించనుంది.

ఈ చిత్రం ద్వారా విజయ్ కుమార్ కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇష్క్ చిత్రానికి విజయవంతమైన మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్ర ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో ఇషా తల్వార్, మధు నందన్, రఘుబాబు, తాగబోతు రమేష్, అలీ, ఆహుతి ప్రసాద్, సుధ, సంధ్యా జనక్ నటిస్తున్నారు. సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఆండ్రూ బాబు.ఐ, ఎడిటర్: ప్రవీన్ పూడి, లిరిక్స్: కృష్ణ చైతన్య, శ్రీమణి, ఆర్ట్స్ రాజీవ్ నాయర్, మాటలు-స్క్రీన్ ప్లే: హర్ష వర్ధన్, నిర్మాత: నిఖితా రెడ్డి, కథ-దర్శకత్వం: విజయ్ కుమార్ కొండ.


Click it and Unblock the Notifications











