twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నితిన్ రాకతో సందడి, పవన్ అభిమానులు సైతం

    By Bojja Kumar
    |

    శ్రీకాకుళం : హీరో నితిన్ శ్రీకాకుళం జిల్లా ఆసరెల్లిలోని కార్తీక థియేటర్లో సందడి చేసారు. తన తాజా సినిమా 'గుండె జారి గల్లంతయ్యిందే' సూపర్ హిట్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న నితిన్ ఆసరెల్లిలో హీరోయిన్ ఇషా తల్వార్‌తో కలిసి హాజయ్యాడు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

    యువత కష్టపడితే ఏదైనా సాధించగలరని, కష్టపడి పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని నితిన్ సూచించారు. హీరోయిన్ ఇషా తల్వార్ మాట్లాడుతూ....తాను తెలుగులో నటించిన తొలి సినిమా విజయవంతం కావడంపై ఆనందం ఉందని, ఈ హిట్ తన కెరీర్‌కు ప్లస్సవుతుందని వ్యాఖ్యానించారు.

    కాగా.....'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో చూస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేయడంతో పాటు, పలు సీన్లు ఉండటంతో ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఫ్యాన్స్. నితిన్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అనే సంగతి తెలిసిందే.

    సినిమా ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్‌, బ్రాండ్ న్యూ లవ్ స్టోరీరీ తోడు....పవన్ ఎఫెక్టు కూడా తోడవటంతో సినిమా వసూళ్ల పరంగా దూసుకెలుతోంది. ఈ చిత్రం వసూళ్ల పరంగా త్వరలో రూ. 20 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అంటున్నారు ట్రేడ్ నిపుణులు. గుండెజారి గల్లంతయ్యిందే చిత్రం తర్వాత నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రం చేస్తున్నాడు. గౌతం మీనన్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. యామి గౌతం నితిన్ సరసన హీరోయిన్ గా ఎంపికయింది. కార్తీక్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

    ఈ సినిమాల తర్వాత మరో రెండు ప్రాజెక్టులు నితిన్‌కు ఖరారయ్యాయి. అందులో కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్వకత్వంలో రూపొందబోయే సినిమా ఒకటి కాగా, మరొకటి అలా మొదలైంది, జబర్దస్త్ చిత్రాల ఫేం నందినీరెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాలు 2014లో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

    English summary
    Gunde Jaari Gallanthayyinde success tour at Srikakulam. Nitin and isha Talwar visited Karthika theatre in Arasavalli. Gunde Jaari Gallanthayyinde written by Harshavardan, directed by Vijay Kumar Konda. The film was produced by N. Nikitha Reddy and presented by Vikram Gowd under Sresht Movies banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X