‘గుండెల్లో గోదారి’ సెన్సార్ రిపోర్ట్-తాప్సి ముద్దుసీన్ కట్
హైదరాబాద్ : మంచు లక్ష్మి 'గెండెల్లో గోదారి' చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఫిబ్రవరి 21న చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా...ఈ చిత్రం గురించి ఓ రూమర్ వినిపిస్తోంది. ఈచిత్రంలో తాప్సి-ఆది మధ్య ఘాటైన రొమాంటిక్ సీన్లు చిత్రీకరించారని, వీరిద్దరి మధ్య ఉండే ముద్దు సీన్ కు సెన్సార్ బోర్డు కత్తెర వేసిందని టాక్.
1986లో వచ్చి గోదావరి వరదల నేపథ్యంలో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్ర ధారులుగా రూపొందుతున్న 'గుండెల్లో గోదారి' చిత్రానికి నాగేంద్ర కుమార్ దర్శకత్వం వహించారు. గత సంవత్సరమే ఈచిత్రం విడుదలవ్వాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడింది.
ఈ చిత్రం గురించి ప్రత్యేకతలను గురించి చెప్పుకోవాలంటే....ఇప్పటి సినిమాలకు పూర్తి భిన్నంగా ధీన్ని తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం అందించడం మరో విశేషం. ఇప్పటికే విడుదలైన పాటల మంచి ఆదరణ పొందాయి. ప్రకృతి విలయం వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందించారు.
కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రంలో చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











