‘గుండెల్లో గోదారి' సెన్సార్ కట్స్ ఇవే
సినిమా పేరు : గుండెల్లో గోదారి
భాష: తెలుగు
మూవీ కేటగిరి: UA
రీజనల్ ఆఫీస్ సర్టిఫైడ్: హైదరాబాద్
సర్టిఫికేట్ నెంబర్: DIL/2/6/2013 HYD
సర్టిఫైడ్ డ్యూరేషన్: 131:0:MM:SS
నిర్మాత పేరు: మంచులక్ష్మీ ప్రసన్న, మంచు ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్
1.ఓ సీన్ లో దీనమ్మ, లమ్డి కొడక,లంజ కొడక, ముండ అనే పదాలు ఎక్కడ వచ్చినా తొలిగించమన్నారు.
2. ఓ పాటలో ముమైత్ ఖాన్ బ్రెస్ట్ చూపించే సన్నివేశాలును,తైస్ కనిపించే షాట్స్ ని తొలిగించి ఆ స్దానంలో ఎటువంటి ఎక్సపోజింగ్ లేని సీన్ లను జత చేయమన్నారు.(మూడవ పాట,ఆరవ పాటలో ఈ షాట్స్ కట్ అయ్యాయి)
3. బెడ్ పై ఆది,తాప్సీలపై తీసిన హాట్ సన్నివేశాలతో పాటు, లిప్ కిస్ సీన్ ని తొలిగించి ఆ స్ధానంలో అవసరమైన సన్నివేశాల్ని పెట్టమన్నారు.
4. మధ్యపానం, ధూమపానం, సీన్స్ వచ్చినప్పుడు వాటిని త్రాగుడ, సేవించుట హానికరం అని హెచ్చరించవల్సిందిగా సూచించారు.
5. పంతులు పిలక జాగ్రత్త...అనే డైలాగు ని తొలిగించారు. అక్కడ విజువల్ ని మ్యూట్ చేయటమో కట్ చేయటమో చేయమని సూచించారు.
6. AWBI అనుమతి ప్రకారం జంతువులు కనిపించే సీన్స్ ను అనుమతించి మిగతా వాటి వాటిని తొలిగించి వాటి స్ధానంలో ఆమోదయోగ్యమైన దశ్యాలను జత చేయమన్నారు.
1986లో వచ్చి గోదావరి వరదల నేపథ్యంలో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్ర ధారులుగా రూపొందుతున్న 'గుండెల్లో గోదారి' చిత్రానికి నాగేంద్ర కుమార్ దర్శకత్వం వహించారు. గత సంవత్సరమే ఈచిత్రం విడుదలవ్వాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడింది.


Click it and Unblock the Notifications












