‘గుండెల్లో గోదారి’ ఆడియో రిలీజ్ విశేషాలు
ఆది పనిశెట్టి, సందీప్ కిషన్, మంచు లక్ష్మీ, తాప్సి హీరో హీరోయిన్లుగా కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గుండెల్లో గోదారి'. మంచు ఎంటర్ టైన్మెంట్స్ బేర్ పై మోహన్ బాబు సమర్పణలో మంచు లక్ష్మీ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం బుధవారం రాత్రి గాంధర్వ మహల్ సెట్లో నిర్వహించారు.
ఈ చిత్రానికి సంగీతం అందించిన ఇళయరాజా చేతుల మీదుగా సీడీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, ఇళయరాజా, కీరవాణి, విష్ణు, లక్ష్మి ప్రసన్న, మనోజ్, సందీప్, కిషన్, కోటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ నేను ఇచ్చిన ట్యూన్ల గురించి నేను మాట్లాడట ఇష్టం ఉండదు, సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా అన్నారు.
మోహన్ బాబు మాట్లాడుతూ...సినిమా విజయం సాధిస్తుందో, లేదో ముందే ఎవరూ చెప్పలేరు. ఎంత కాంపిటీషన్ ఉన్నా సాధిస్తాననే పట్టుదల ఉండాలి. నా కూతురిలో ఆ పట్టుదల ఉంది. పిక్చర్ సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా అది దర్శకుడి బాధ్యతే. దర్శకుడు చెప్పిన దానికంటే బాగా తీసాడు. ఇంకా గొప్ప దర్శకుడు కావాలని కోరుకుంటున్నారు. ఈ దేశంలో ఎన్ని అవార్డులు అన్ని అవార్డులు ఈచిత్రం ద్వారా నా బిడ్డకు వస్తాయని అనుకుంటున్నాను.
1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు.
కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రం చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రానికి సమర్పణ:మోహన్‌బాబు.ఎం. నిర్మాత:మంచు లక్ష్మీ ప్రసన్న, దర్శకత్వం:కుమార్ నాగేంద్ర.


Click it and Unblock the Notifications











