twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరదల్లో ప్రేమకథ (‘గుండెల్లో గోదారి' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్ర ధారులుగా రూపొందుతున్న చిత్రం 'గుండెల్లో గోదారి'. ఎన్నో వాయిదాల తర్వాత ఈ చిత్రం ఈ రోజు (శుక్రవారం) విడుదల అవుతోంది. దివిసీమ ఉప్పెనల నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు.

    హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ -''దివిసీమ ఉప్పెనల నేపథ్యంలో సాగే కథాంశం ఇది. ఈ కథలో అంతర్లీనంగా రెండు ప్రేమకథలుంటాయి. నేను, తాప్సీ ఓ జంట అయితే... నేను, లక్ష్మీప్రసన్న మరో జంట. అందుకని ఇది ముక్కోణ ప్రేమకథకాదు. ఇద్దరితో నేను సాగించే ప్రేమాయణం ఆసక్తికరంగా ఉంటుంది'' అని చెప్పా రు. మా నాన్న, మోహన్‌బాబుగారి కాంబినేషన్‌లో పెదరాయుడు, ఎం ధర్మరాజు ఎంఎ లాంటి సక్సెస్‌ఫుల్ సినిమాలొచ్చాయి. అలాంటి బేనర్‌లో నటించడం నాఅదృష్టం'' అన్నారు.

    అలాగే ''గోదావరి నేపథ్యంగా సాగే కథ కాబట్టి సినిమా ఎక్కువగా నీటిలోనే తెరకెక్కించారు. చాలాసేపు నీళ్లలోనే ఉండాల్సి వచ్చేది. కొన్నిసార్లు సమస్యలూ ఎదురయ్యాయి. కానీ గోదావరి ప్రయాణం ఓ తియ్యని జ్ఞాపకంగా మిగిలిపోయింది. 'టైటానిక్' సినిమా పేరు చెప్పగానే ఎవరికైనా షిప్ మునిగిపోవడమే గుర్తొస్తుంది. కానీ అది గొప్ప ప్రేమకథ. 'గుండెల్లో గోదారి' కూడా అదే కోవకు చెందిన సినిమా. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్''అన్నారు ఆది పినిశెట్టి.

    ఇక తన పాత్ర గురించి ఆది చెపుతూ...ఇందులో మత్యకారుని పాత్ర. పేరు మల్లిగాడు. ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడతాను. అందుకోసం షూటింగ్‌కు రెండు వారాల ముందే రాజమండ్రికి వెళ్లాను. అక్కడి మత్స్యకారులతో గడిపాను. వాళ్ల ఆహార్యం, భాష ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. ప్రత్యేకంగా గోదావరి యాస నచ్చింది. రెండు వారాలు తక్కువ సమయమే. అయితే మా ఇంట్లోనూ కొంత వరకూ ఆ యాస ఉంటుంది. కాబట్టి ఇట్టే అలవాటుపడ్డాను. అక్కడ షూటింగ్‌ జరిగిన ప్రతి రోజు ఓ జ్ఞాపకమే. నీళ్లపై కంటే నీళ్ల లోపల చిత్రీకరణ ఎక్కువ రోజుల చేయడం వలన నాకు మలేరియా కూడా వచ్చింది. లక్ష్మీ ప్రసన్న, తాప్సి ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంది. 'ఒక విచిత్రం' తర్వాత తెలుగులో నేను నటిస్తున్న ఈ చిత్రం నా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది''అన్నారు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ-''ఈ సినిమాని తను ఎలా తీయబోతున్నాడో కొన్ని ఉదాహరణలు చెప్పాడు దర్శకుడు కుమార్‌నాగేంద్ర. గతంలో వచ్చిన ఉప్పెనల తాలూకు ఫొటోలను చూపించడంతో పాటు, తను చేసిన పరిశోధన గురించి కూడా చెప్పాడు. దాంతో ఈ సినిమా చేస్తే వర్క్‌అవుట్ అవుతుందనిపించింది. లొకేషన్‌కి వెళ్లాక అతని టేకింగ్ స్టైల్ నా నమ్మకాన్ని రెట్టింపు చేసింది'' అన్నారు.

    బ్యానర్ : మంచు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవెట్ లిమిటెడ్
    నటీనటులు: ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ , మురళీమోహన్, రవిబాబు, జీవా, అన్నపూర్ణ, తదితరులు
    పాటలు: చంద్రబోస్, అనంత్‌శ్రీరామ్, రాము,
    ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ,
    కెమెరా: ఎం.ఆర్.పళనికుమార్,
    నిర్మాత: లక్ష్మీ మంచు,
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర.
    విడుదల తేదీ: 08 మార్చి, 2013.

    English summary
    
 After Several postponements finally Manchu Lakshmi’s Gundello Godari is ready for a grand release throughout the world today. Aadhi, Lakshmi Manchu, Taapsee Pannu and Sundeep Kishan played the main lead roles in the movie. Gundello Godari movie story revolves around 1986 Godavari floods. Gundello Godari is directed by a new director Kumar Nagendra and produced by Lakshmi Manchu on Manchu Entertainments banner. Music Maestro Ilayaraja has scored the music. Gundello Godari Review will be updated today , watch out this space for the movie review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X