‘గుండెల్లో గోదారి’ రిలీజ్ డేట్
హైదరాబాద్: ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్ర ధారులుగా రూపొందుతున్న చిత్రం 'గుండెల్లో గోదారి'. నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. విడుదల విషయాన్ని మంచు లక్ష్మి తన ట్విట్టర్లో వెల్లడిస్తూ...దసరాకు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రంలో చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











