‘గుండెల్లో గోదారి’ రిలీజ్ డేట్ మళ్లీ మారింది
హైదరాబాద్: ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్ర ధారులుగా రూపొందుతున్న చిత్రం 'గుండెల్లో గోదారి'. నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తోన్న ఈ సినిమా మార్చి 8న విడదులకు సిద్దం అవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు మొదలు పెట్టారు.
చాలా కాలం క్రితమే ఈచిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. దసరా పండక్కే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఆ మధ్య నిర్మాతలు ప్రకటించినా అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. 2012 డిసెంబర్లో విడుదలవ్వాల్సి ఉన్నా థియేటర్ల సమస్య కారణంగా బ్రేక్ పడింది. సంక్రాంతికి విడుదల చేద్దామంటే పెద్ద సినిమాల మధ్య ఈచిన్న సినిమా నలిగిపోతుందనే భయంతో ఆ సాహసం చేయలేదు.
తాజాగా చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేద్దామని అనుకున్నారు. సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. కానీ అనుకోని కారణాలతో మార్చి 8కి విడుదల వాయిదా వేసారు. సినిమా వివరాల్లోకి వెళితే..... కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రంలో చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు.
ఇళయరాజా అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











