twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గుండెల్లో గోదారి’ టాకేంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : చాలా కాలం నుంచి వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్న మంచు లక్ష్మి ప్రసన్న చిత్రం 'గుండెల్లో గోదారి' ఎట్టకేలకు ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ముందు నుంచి ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. స్టార్ యాక్టర్స్, స్టార్ టెక్నీషియన్స్ లేకపోయినా....ఇళయరాజా లాంటి గ్రేట్ మ్యూజీషియన్ సంగీతం అందించడం, మంచు లక్ష్మి, తాప్సీ నటిస్తుండటంతో కొంత మంది మాత్రం సినిమాపై ఆసక్తి చూపుతున్నారు.

    తాజాగా విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది. డిఫరెంట్ సబ్జెక్టు అయినప్పటికీ, సినిమాలో ఎంటర్ టైన్మెంట్స్ పాళ్లు లోపించడంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. అయితే 1986 నాటి దివిసీమ వరదలను సినిమాలో బాగా చూపెట్టారని, సినిమాటోగ్రఫీ బాగుందని టాక్.

    మంచు లక్ష్మి తన అద్భుత నటను కనబర్చింది. ఆది చాలా ఎఫెక్టివ్ గా నటించాడు. తాప్సీ పాత్ర ఇంట్రస్టింగ్ గా, గ్లామరస్ గా ఉంది. సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రమే.. అనే టాక్ వినిపిస్తోంది. జస్ట్ వన్ టైం వాచ్ అని కొందరు, అది కూడా కష్టమే అని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.

    నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మించింది. కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. సినిమాకు ఈ సెట్ బాగా ప్లస్సయింది. 1986 నాటి వాతావరణాన్ని బాగా చూపెట్టారు.

    English summary
    Lakshmi Manchu's latest production Gundello Godari is one of highly-talked about and most-awaited Telugu movies. It was to release in November 2013, but due to unavailability of enough number of theatres, the movie had to be delayed. Its promos have soared up the viewers' curiosity to sky high.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X