కరణ్ జోహార్ ఎడారిలో ఇసుక అమ్మే రకం.. రిలీజ్ కాదనుకున్న మూవీతో 70కోట్ల డీలింగ్!

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ టాలెంట్ ఎంత ఉన్నా బిజినెస్ మైండ్ లేకపోతే అక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఇక కరణ్ జోహర్ లాంటి నిర్మాత దర్శకుడు అలాంటి బిజినెస్ డీలింగ్స్ లలో చాలా తెలివిగల వ్యక్తి అని చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు. సినిమా ప్లాప్ అయినా కూడా తన జేబులో నుంచి డబ్బులు పోకుండా జాగ్రత్త పడతాడు. ఇక రిలీజ్ అవ్వడనికే నానా అవస్థలు పడుతున్న ఒక సినిమాతో కూడా ఇటీవల మంచి లాభలని అందుకున్నాడు.

 ఎడారిలో ఇసుక అమ్మే రకం..

ఎడారిలో ఇసుక అమ్మే రకం..

కరణ్ జోహార్ పై నెపొటీజమ్ కామెంట్స్ ఏ రేంజ్ లో వస్తున్నాయో ఇటీవల సుశాంత్ సింగ్ సూసైడ్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. కేవలం సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారితోనే సినిమాలు చేయడం ఆయనకు ముందు నుంచి అలవాటే. ఎలాంటి సినిమా చేసినా కూడా లాభం లేనిదే అస్సలు చేయడు. బిజినెస్ విషయంలో.. ఆయన ఎడారిలో కూడా ఇసుక అమ్మేస్తాడానే విధంగా కామెంట్స్ చేస్తుంటారు.

గుంజన్ సక్సేనా: ద కార్గిల్ కార్ల్

గుంజన్ సక్సేనా: ద కార్గిల్ కార్ల్

కార్గిల్ యుద్ధంలో యుద్ధ విమానాలు నడిపిన గుంజన్ సక్సనా సక్సేనా జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు అయితే లేవు. జాన్వీ కపూర్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమాకు స్లోగా కరణ్ జోహార్ తన ప్రమోషన్స్ ప్లాన్స్ తో హైప్ క్రియేట్ చేశాడు. ఇక ఇంతలో కరోనా దెబ్బతో సినిమా పనైపోయింది అనే విధంగా కామెంట్స్ వచ్చాయి.

లాభం ఎంతంటే..

లాభం ఎంతంటే..

ఫస్ట్ మూవీతో సరైన సక్సెస్ దక్కలేదని బాధతో ఉన్న జాన్వీ ఇప్పుడు గుంజన్ సక్సేనా బయోపిక్ కూడా థియేటర్స్ లో రిలీజ్ కాకపోవడంతో కాస్త అప్సెట్ అయ్యిందట. కానీ కరణ్ జోహార్ తన తెలివితో అసలు రిలీజ్ కాదనుకున్న సినిమాకు 30కోట్ల లాభం వచ్చేలా చేశాడు. ద కార్గిల్ గర్ల్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేస్తే పరిస్థితి ఎలా ఉండేదో కానీ కరణ్ జోహార్ మాత్రం మంచి ప్లాన్ తోనే గుంజన్ సక్సేనా కథను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాడు.

70కోట్ల డీలింగ్..

70కోట్ల డీలింగ్..

నెట్ ఫ్లిక్స్ సంస్థకు 70కోట్లకు ఈ సినిమా ఓటీటీ హక్కులను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 40కోట్ల బడ్జెట్ మాత్రమే అవసరం అయినట్లు సమాచారం. ఇక జాన్వీ రెమ్యునరేషన్ కూడా రెండు కోట్ల లోపే అని తెలుస్తోంది. మొన్న సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకు చతికిల పడినట్లయింది. కానీ కరణ్ తన తెలివితో ప్రాఫిట్ జోన్ లోకి తెచ్చాడు.

లేటయితే లాభాలు రావని..

లేటయితే లాభాలు రావని..

ఇలాంటి సినిమా లేటయితే ఏ మాత్రం లాభాలు రావని డైరెక్ట్ ఓటీటీ బిజినెస్ డీలింగ్స్ పై నెలరోజుల తీరిక లేకుండా చర్చలు జరిపారట. ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ ని 50కోట్లు ఇస్తామని మొదట చెప్పగా ఆ లెక్కలని 70కోట్ల వరకు తీసుకు వచ్చాడట కరణ్. అందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recommended Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
స్పెషల్ డేట్ ఫిక్స్..

స్పెషల్ డేట్ ఫిక్స్..

నిర్మాత కరణ్ జోహార్ కొన్నిరోజుల క్రితమే రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వచ్చే ఆగస్ట్ 15వ తేదీన గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రిలీజ్ అనంతరం జాన్వీ కపూర్ ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X