twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కథలు లేవంటే ఒప్పుకోను..గుణ్ణం గంగరాజు

    By Srikanya
    |

    సినిమా పరిశ్రమలో చాలా మంది కథలు లేవని, కథల కొరత వుందని అంటుంటారు. కాని కథలు వున్నాయని ఈ 'కథ' చిత్రం నిరూపిస్తుంది అంటున్నారు ప్రముఖ దర్శక, నిర్మాత గుణ్ణం గంగరాజు. జెనీలియా, అరుణ్‌ అదిత్‌ జంటగా రాగా శ్రీనివాస్‌ దర్శకత్వంలో జస్ట్‌ ఎల్లో పతాకంపై గుణ్ణం ఊర్మిళ నిర్మిస్తున్న చిత్రం 'కథ'. సెన్సారు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర సమర్పకులు గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ-ఈ సినిమాకు కథే హైలైట్‌. ఇదొక రొమాంటిక్‌ థ్రిల్లర్‌. అన్ని భావోద్వేగాల సమ్మేళనంతో ఈ 'కథ' రూపొందింది. ప్రతి సన్నివేశంలోనూ నవ్యత కనిపిస్తుంది. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో జెనీలియా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. విభిన్న భావోద్వేగాలు కలిగిన అమ్మాయిగా ఆమె కనిపిస్తారు అన్నారు. అలాగే కథ చిత్రం కథ...జార్ఖండ్‌ లో మొదలయ్యే ఈ కథ అరకుతో సంబంధం ఏర్పర చుకుంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తిని రేకెత్తించే విధంగా చిత్రం వుంటుంది. జెనీలియా చాలెంజ్‌గా ఫీలయ్యి చేసిన ఈ పాత్ర ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది' అన్నారు. మిగతా పాత్రల్లో ప్రకాష్‌రాజ్‌, షఫీ, రఘుబాబు తదితరులు నటించారు. సంగీతం: ఎస్‌.కె.బాలచంద్రన్‌, కళ: రవీందర్‌, కెమెరా: ఆండ్రూ, మాటలు: గుణ్ణం గంగరాజు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X