'అమృతం' సీరియల్ తో సంబంధం లేదు: గుణ్ణం గంగరాజు
గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ ''చంద్రమండలంపై జరిగే కథ ఇది. ఓ గొప్ప అంతరిక్ష చిత్రం అని కూడా చెప్పొచ్చు. రెండున్నర గంటలపాటు కడుపుబ్బా నవ్వించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. బుల్లితెరపై ప్రసారమైన ధారావాహికకు ఈ సినిమాకీ మధ్య ఎలాంటి సంబంధం లేదు. కేవలం అందులోని పాత్రలు మాత్రమే ఈ చిత్రంలో కనిపిస్తాయి. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము ''అన్నారు.
అలాగే ధారావాహికల్లో కనిపించే పాత్రలతో సినిమాల్ని తీయడం అరుదు. ఇదివరకు మిస్టర్ బీన్ తరహాలో కొన్ని పాత్రలు మాత్రమే వెండితెరపై సందడి చేశాయి. మేం తొలిసారిగా తెలుగులో ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో యాభై నిమిషాలపాటు గ్రాఫిక్స్ ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అన్నారు. సుచిత్ర, ఆహుతిప్రసాద్, చంద్రమోహన్, కృష్ణ భగవాన్, ఎల్.బి.శ్రీరామ్, రావు రమేష్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్, సంగీతం: శ్రీ, కూర్పు: ధర్మేంద్ర, పాటలు: అనంత శ్రీరామ్.


Click it and Unblock the Notifications












