ఇక్కడ బుల్లెట్లే మాట్లాడతాయి: మహేష్ బాబు
ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో ఆడే పండుగాడు డైలాగ్ తో ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు ది బిజినెస్ మ్యాన్ ఈ చిత్రానికి క్యాప్షన్ గా 'గన్స్ డోంట్ నీడ్ ఎగ్రిమెంట్స్"( 'తుపాకీలకు ఒప్పందాలతో పనిలేదు"). మనుషుల కన్నా...బుల్లెట్లే ఎక్కువగా మాట్లాడతాయి' అంటూ మరోసారి తెరమీద గన్ పేల్చబోతున్నాడు. దూకుడుతో దుమ్ము రేపుతున్న ఈ అందగాడు. మాఫియా బ్యాక్ డ్రాఫ్ లో జరిగే ఈ చిత్ర కథకు మూలం రామ్ గోపాల్ వర్మ అందించిన ఒక 'థాట్".
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'బిజినెస్ మేన్' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పూరీ-ప్రిన్స్ కాంబినేషన్ అంటేనే టక్కున 'పోకిరీ' గుర్తుకు వస్తోంది. అయితే భవిష్యత్ లో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే ఖచ్చితంగా బిజినెస్ మేన్ గుర్తుకు వస్తుందని దర్శకుడు పూరీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
యాక్షన్ తో పాటు వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెంకట్ నిర్మిస్తున్నారు. ప్రిన్స్ సరసన హీరోయిన్ గా కాజల్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాటను ముంబయిలో మంచి దూకుడుతో షూటింగ్ జరుపుకుంటుంది. 27న గోవాకు పయనం అవుతున్న చిత్ర యూనిట్ అక్కడ క్లైమాక్స్ సీన్లను చిత్రీకరించనుంది. మహేష్‌బాబు, కాజల్, ప్రకాష్ రాజ్, షాయాజి షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంథమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











