»   » ‘గన్స్ అండ్ థైస్’ ట్రైలర్ వదిలిన వర్మ.... దారుణంగా ఉంది (వీడియో)

‘గన్స్ అండ్ థైస్’ ట్రైలర్ వదిలిన వర్మ.... దారుణంగా ఉంది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నానంటూ ఈ రోజు ఉదయమే ట్విట్టర్ ద్వారా ప్రకటించిన వర్మ..... అనుకున్నట్లే సాయంత్రం 5.30 గంటలకు నిజంగానే 'గన్స్ అండ్ థైస్' ట్రైలర్ వదిలి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

గతంలో రామ్ గోపాల్ వర్మ 'గన్స్ అండ్ థైస్' పేరుతో ఓ పుస్తకం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు అదే టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ తీసారు. తాజాగా ఆ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ వదిలారు. ముంబై మాఫియా నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుందని తెలుస్తోంది.

సినిమాల్లో చూపించలేని పచ్చి సీన్లు ఇందులో...

సినిమాల్లో చూపించలేని పచ్చి సీన్లు ఇందులో...

నేను చాలా సార్లు ముంబై మాఫియాకు సంబంధించిన నిజమైన స్టోరీని ఉన్నది ఉన్నట్లుగా రియలిస్టిక్ సన్నివేశాలతో సినిమాల్లో చూపించాలనుకున్నాను. కానీ పలు కారణాల వల్ల సినిమాల్లో వాటిని చూపించలేక పోయాను. వాటిని ఈ వెబ్ సిరీస్ లో ప్రజెంట్ చేస్తున్నాను అంటూ వర్మ తెలిపారు.

దారుణంగా ఉంది

దారుణంగా ఉంది

‘గన్స్ అండ్ థైస్' ట్రైలర్ చూడటానికి చాలా దారుణంగా ఉంది. ఇందులో చూపించిన క్రైమ్ సీన్లు చూడటానికి భయంకరంగా ఉన్నాయి. సినిమాల్లో చూపించలేని అత్యంత దారుణమైన సీన్లు చూపించడానికి యూట్యూబ్ ను వేదికగా చేసుకున్నాడు వర్మ.

నగ్న సన్నివేశాలు

నగ్న సన్నివేశాలు

ముంబై మాఫియాకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను ఫోకస్ చేసే క్రమంలో వర్మ ఇందులో కొన్ని నగ్నసీన్లు కూడా జొప్పించాడు.

అంచనాలు పెంచిన ట్రైలర్

ఈ ట్రైలర్ వెబ్ సిరీస్ పై అంచనాలు మరింత పెంచింది. ప్రస్తుతం అంతా ఇంటర్నెట్ కాలం కావడంతో ఈ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు.

English summary
Ram Gopal Varma to make a web series on gangsters. GUNS & THIGHS Web SERIES SEASON 1 OFFICIAL TRAILER released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu