Guntur Kaaram First Review: సంక్రాంతికి సూపర్ హిట్ బొమ్మ.. కానీ ఆ విషయమే డౌట్.. క్రిటిక్స్ రివ్యూ
సంక్రాంతి పండుగ బరిలో తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక మంది సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో గుంటూరు కారం ఒకటి అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిన బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు నిర్మాతగా చినబాబు వ్యవహరిస్తున్నారు. జనవరి 12వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి క్రిటిక్ రివ్యూ బయటకు వచ్చింది. ఆ క్రిటిక్ ఎలాంటి రివ్యూ ఇచ్చారనే విషయంలోకి వెళితే..
మహేష్ బాబు టీమ్ నుంచి ప్రమోషన్స్ పరంగా ఎలాంటి స్పందన లేకపోయినా పండుగ సీజన్‌లో గుంటూరు కారం సినిమాకు మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. గ్లిప్స్, టీజర్, పాటలు, ట్రైలర్ లాంటి అంశాలు సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా పాటలు వివాదంగా మారడం, భారీగా ట్రోల్స్ జరగడం వల్ల సినిమా గురించి చర్చించుకొనేలా చేశాయి.

ఇదిలా ఉండగా, సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లు, స్క్రీన్ల కేటాయింపు వ్యవహారం కూడా వివాదంగా మారడంతో గుంటూరు కారం సినిమా గురించి ఎక్కువగానే చర్చ జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం కూడా అనేక ఊహాగానాలకు, చర్చలకు దారి తీశాయి.
ఇలాంటి పరిస్థితుల్లో వస్తున్న గుంటూరు కారం సినిమా రివ్యూను దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ రివ్యూ ఇచ్చారు. ఈ మూవీ గురించి చెబుతూ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు నుంచి నా ఫస్ట్ రివ్యూ ఇది. మహేష్ బాబు, ఫుల్ డోస్‌లో ఉండే ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని ఉమేర్ సంధూ చెప్పారు.

గుంటూరు కారం సినిమా మాస్ ప్రేక్షకులకు కిక్కిచ్చే విధంగా మంచి మసాలాలు దట్టించి తీశారు. సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ రూల్స్‌ను తిరగరాస్తుంది. పండుగ సమయంలో రిలీజ్ అయ్యే సినిమాల్లో మంచి సత్తా ఉన్న సినిమా. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ బొమ్మ అంటూ ఉమేర్ సంధూ చెప్పారు. ఈ సినిమాకు నా రేటింగ్ 3.5/5 అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఉమేర్ సంధూ చేసే ట్వీట్ రివ్యూలపై నెటిజన్లకు అనేక సందేహాలు ఉన్నాయి. సినిమా చూసి రాస్తాడా? చూడకుండా హైప్ చేస్తాడా? అని కామెంట్లు చేస్తున్నారు. గతంలో బ్రహ్మండం అని చెప్పిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక సినిమా విషయంలో సూపర్ హిట్ అంటూ తన వెర్షన్ వినిపించారు. కానీ తెలుగు ఫిల్మ్ బీట్ వెల్లడించే ఫస్ట్ రివ్యూ కోసం వేచి చూడండి..


Click it and Unblock the Notifications











