మనసే బాలేదు ఏసేస్తా ఫుల్లు అంటున్న మహేష్ బాబు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూపర్ సాంగ్ రిలీజ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా రాబోతున్న సినిమా గుంటూరు కారం గురించి అందరికీ తెలిసిందే. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. అతడు, ఖలేజా తర్వాత దాదాపు 13 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాను జనవరి 12వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అదే రోజు విడుదల చేస్తున్నారు.
ఇదంతా ఇలా ఉండగా.. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. గుంటూరులో నిర్వహించిన ఈ వేడకలో మహేష్ బాబు, త్వివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రామజోగయ్య శాస్త్రి, తమన్ లు పాల్గొన్నారు. ఫుల్ గా సందడి చేశారు. సినిమా గురించి అదిరిపోయే అప్ డేట్లను ఇచ్చారు. సినిమా సూపర్ డూపర్ హిట్టు కావాలని కోరుకుంటూనే ఈ సినిమా నుంచి మరో సూపర్ డూపర్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అయితే ఆ పాట ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Recommended Video


గుంటూరు కారం సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల అయ్యాయి. అందులో ఒకటి దమ్ మసాలా బిర్యానీ, రెండో ఓ మై బేబీ, అలాగే మూడోది మాస్ మసాలా సాంగ్ కుర్చి మడత పెట్టి. ఇప్పటికే విడుదల అయిన ఈ మూడు పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దమ్ మసాలా బిర్యానీతో పాటు కుర్చి మడతపెట్టి పాటలకు వచ్చిన వ్యూస్ కు యూట్యూబ్ అంతా షేకైపోయింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నాలుగో పాటను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా విడుదల చేశారు.
అదరిపోయే మ్యూజిక్ తో స్టార్ అయిన ఈ సాంగ్ లో లిరిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా మావా ఎంతైనా పర్లేదు బిల్లూ.. మనసూ బాలేదు ఏసేస్తా ఫుల్లూ.. గుండే లోతుల్లో గుచ్చిందీ ముల్లూ.. చెప్పుకోలేని బాధే డబ్బల్లూ... అంటూ సాగగా మహేష్ బాబు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇక ఆ తర్వాత మారిపోయే లోకం.. చెడ్డదంటూ లోకం.. నాజూకైన నా బోటోడికి దినదినమొక నరకం.. యాడలేదు లోపం నామీదే నాకు కోపం.. అంటూ వచ్చే లిరిక్స్ చూస్తుంటే.. మహేష్ బాబు ఏదో బాధలో ఉన్నాడని అర్థం అవుతుంది.
ఇంతటి అద్భుతమైన పాటను ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా విడుదల చేయగా.. అక్కడకు వచ్చిన అభిమానులు అంతా తెగ సంబురపడిపోయారు. పాటను స్క్రీన్ పై చూసేందుకు చాలానే కష్టపడ్డారు. జనవరి 12వ తేదీన రాబోతున్న ఈ సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించారు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీసును బద్ధలు చేస్తుందనేది.


Click it and Unblock the Notifications











