గుంటూరు కారం సినిమాకు ప్రత్యేక షోలు.. తెలంగాణలో టికెట్ రేట్లు ఎంతంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న తాజా సినిమా గుంటూరు కారం గురించి అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవిరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు ఈ సనిమా చూస్తామా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే సినిమా నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు తెలంగాణ ధరలు పెంచుకుంటామని పర్మిషన్ అడగ్గా... రాష్ట్ర ప్రభుత్వం స్పందిచింది. టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.

తెలంగాణ సర్కారు ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండతో ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా పెరుగనున్నాయి. ఇలా నైజాంలో గుంటూరా కారం చిత్రానికి భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఈ సినిమా టికెట్ల ధరలు ఎలా ఉన్నాయి, ఎన్ని షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. ఎప్పుడెప్పుడు షోలు ఉండబోతున్నాయే పూర్తి వివరాల గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం.

Recommended Video

Guntur Kaaram Ticket Price ఘాటు మరీ ఎక్కువైందిగా | Telugu Filmibeat

Guntur Kaaram Ticket Rates in Telangana: Mahesh Movie Special Shows details in Nizam here

గుంటూరు కారం సినిమాకు ఉదయం నాలుగు గంటలకు షోలు వేసుకోవడానికి కూడా తెలంగాణ సర్కారు పర్మిషన్ ఇచ్చింది. వారం రోజులు పాటు ఉదయం 4 గంటల షో వేసుకోవచ్చని తెలిపింది. అలాగే సినిమా విడుదల అయ్యే మొదటి రోజు అర్ధరాత్రి ఒంటి గంట షోలకు కూడా అనుమతి ఇచ్చింది. ఇలా జనవరి 11వ తేదీ అర్ధరాత్రి 1 గంటలకు మొత్తం 23 థియేటర్లలో ఈ సినిమా వేసుకునే అవకాశం కల్పించారు.

అలాగే గుంటూరు కారం సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం పెంచిన టికెట్ రేట్లు ఇలా ఉన్నాయి. నైజాంలో సింగిల్ స్క్రీన్లలో రెగ్యులర్ ధర 175 రూపాయలు కాగా.. 65 రూపాయలు పెంచుకునే వెసులు బాటు కల్పించింది. ఇలా సింగిల్ స్క్రీన్ లో 250 రూపాయల టికెట్ ఉండబోతుంది. అలాగే మల్టీ ప్లెక్సుల్లో రెగ్యులర్ గా 295 రూపాయల టికెట్లు ఉండగా... 100 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇలా మల్టీప్లెక్సుల్లో టికెట్ ధన 395 రూపాయలుగా మారిపోయింది.

Guntur Kaaram Ticket Rates in Telangana: Mahesh Movie Special Shows details in Nizam here

మహేష్ బాబు, శ్రీలీలలు హీరోహీరోయిన్లుగా రాబోతున్న ఈ సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించారు. అలాగే మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా కనిపించబోతుంది. జగపతి బాబు, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, ఈశ్వరీ రావు, రావు రమేష్, మురీళ శర్మ, సునీల్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, మధుసూధన్ రావు, అజయ్ ఘోష్, మహేష్ ఆచంట, రఘుబాబులు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. చూడాలి మరి జనవరి 12న రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొట్టునుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X