A Masterpiece: గుప్పెడంత మనసు ఫేం జ్యోతి రాయ్ ప్రియుడి కొత్త సినిమా... హాలీవుడ్ రేంజ్‌లో విలన్ లుక్
గుప్పెడంత మనసు సీరియల్ ఫేం జగతి అలియాస్ జ్యోతి రాయ్ గురించి ఈ మధ్య వార్తలు వైరల్ గా మారాయి. దానికి కారణం ఆమె ఓ డైరెక్టర్ తో ప్రేమలో పడటమే. అంతే కాదు.. వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా జ్యోతిరాయ్ ప్రియుడు సుకు పూర్వజ్ మాస్టర్ పీస్ అనే ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా నుంచి విలన్ లుక్ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. ఆ వివరాల్లోకి వెళితే....
బుల్లితెర నటి, గుప్పెడంత మనసు సీరియల్ ఫేం జ్యోతి రాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె సీరియల్ లో ఎంత పద్ధతిగా ఉంటుందో.. బయట అందుకు భిన్నంగా ఉంటుంది. ఇక మోడ్రన్ లుక్ లో కనిపిస్తూనే.. అందాల ఆరబోత కూడా ప్రదర్శిస్తుంది. అయితే దాదాపు నాలుగు పదుల వయసులో జ్యోతిరాయ్ ప్రేమలో పడటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక జ్యోతిరాయ్ ప్రియుడు.. దర్శకుడు సుకు పూర్వజ్. ఆయన కన్నడంలో పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు.. ఇటీవల జ్యోతి రాయ్ తన సోషల్ మీడియా అకౌంటు పేరును మార్చుకుంది. జ్యోతి రాయ్ కు బుదులు... జ్యోతి పూర్వజ్ అని మార్చుకుని.. నెటిజన్స్ కు వీరిద్దరూ కలిసే ఉంటున్నట్లు షాక్ ఇచ్చింది. అయితే వీరికి పెళ్లైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక సుకు పూర్వజ్ దర్శకత్వంలో శుక్ర, మాటరాని మౌనమిది విభిన్న సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆయన దర్శకత్వంలో ఏ మాస్టర్ పీస్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అరవింద్ కృష్ణ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇక సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రెగుల నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఇక తాజాగా ఏ మాస్టర్ పీస్ సినిమా నుంచి సూపర్ విలన్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మనీష్ గిలాడా ఈ సూపర్ విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే.. ఇందులో విలన్ డేట్ ఆఫ్ బర్త్ మూడు సార్లు, డేట్ ఆఫ్ డెత్ రెండు సార్లు రాయడం ఆసక్తిని కలిగిస్తోంది. 1960 సంవత్సరంలో పుట్టి... 1986 సంవత్సరంలో చనిపోయిన ఈ సూపర్ విలన్ మళ్లీ... 1986లో పుట్టి 2010లో మరణిస్తాడు. తిరిగి 2010 లో పుట్టి ఎప్పుడు కన్నుమూస్తాడు అనేది ప్రశ్నార్థకంతో ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు.
ఏ మాస్టర్ పీస్ అనేది వైవిధ్యమైన కథాంశం రూపొందినట్లు విలన్ క్యారెక్టర్ లుక్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఏ మాస్టర్ పీస్ సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. గతంలో ఈ సినిమా నుంచి విడుదల చేసిన హీరో అరవింద్ కృష్ణ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో స్నేహ గుప్త, అర్చనా అనంత్, జ్యోతిరాయ్, జయ ప్రకాశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం ఆశీర్వాద్ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











