»   » నా మొగుడుతో సెక్స్ సీన్స్ లో రెచ్చిపోతావా?, హీరో గారి భార్య ఫైర్

నా మొగుడుతో సెక్స్ సీన్స్ లో రెచ్చిపోతావా?, హీరో గారి భార్య ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబయి: ఏమండీ..ఆ హీరో చూడండి..ఎంత బాగా ప్రేమను వ్యక్తం చేస్తున్నాడో, భార్యతో ఎంత బాగా చూసుకుంటున్నాడో ..మీరూ ఉన్నారు దేనికి అంటూ దెప్పింది ఓ బార్య టీవిలో సినిమా చూస్తూ...దానికి ఆ భర్త వెంటనే...అలా చేసినందుకు ఆ హీరోకు డబ్బులిస్తారు. నాకు ఏమొస్తుంది అన్నాడట. ఇప్పుడీ జోక్ ఎందుకు గుర్తు వచ్చింది అంటారా...

  సినిమాలు వేరు, జీవితం వేరు అని ఈజీగా చెప్పేస్తూంటాం. అలాగే సినిమావాళ్లు కూడా అబ్బే తెరమీద మీరు చూసేదేమీ నిజం కాదు. అనవసరంగా ఎక్కువ ఊహించుకోవద్దు అంటారు. అలాగే మేం తెరమీద ఒలికపోసే శృంగారం ఉత్తిత్తిదే అని మా ఇంట్లో వాళ్లకు తెలుసు, కాబట్టి వాళ్లు సీరియస్ గా తీసుకోరు అని ఇంటర్వూలలో చెప్పేస్తూంటారు.

  కానీ ఒక్కోసారి...రివర్స్ లో సీన్ ప్లే అవుతూంటుంది. తెరమీద ఒలకపోసే శృంగారం ఇంట్లో వాళ్లను కంగారుపెడుతుంది. భార్యలు గొడవలు చేస్తారు. ఇదిగో ఈ హీరోగారి వ్యవహారంలో ఇప్పుడు అలాంటి తుఫానే చెలరేగుతోంది.

  మా ఆయనతో అంతలా సెక్స్ సీన్స్ లో..

  మా ఆయనతో అంతలా సెక్స్ సీన్స్ లో..

  విడుదలైనప్పటి నుంచీ అభిమానుల్లో వేడిపుట్టిస్తోంది 'వజా తుమ్‌హో' ట్రైలర్‌. అందరూ సనాఖాన్ అందాలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే అందులో ఈ బోల్డ్ ట్రైలర్ చూసి మాత్రం దేవి చౌదరి మాత్రం మండిపడుతోంది. ఆవిడ ఎవరూ అంటారా..ఈ ట్రైలర్ లో సనాఖాన్ ఎవరితో అయితే బెడ్ మీద రెచ్చిపోయిందో ఆయన భార్య.

  అంతలా నా భర్తతో రెచ్చిపోవటం ఏమిటి

  అంతలా నా భర్తతో రెచ్చిపోవటం ఏమిటి

  గురుమీత్‌ ఛౌదరి భార్య దేబినా చౌదిరి ఇప్పుడు తన భర్తపై ఓ రేంజిలో కోప్పడుతోంది. తన భర్తతో అంతలా ఎరోటిక్ సీస్స్ చేసిన సనా ఖాన్ ని సైతం తిట్టిపోస్తోంది. ఆ సెక్స్ సీన్స్ ఏంటి..ఆ రెచ్చిపోవటం ఏంటి అని నిలదీస్తోంది. ఈమె కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

  మొగుడుని చెడా మడా తిట్టేసింది

  మొగుడుని చెడా మడా తిట్టేసింది

  బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం...దెబీనా తన భర్త నటించిన చిత్రం ట్రైలర్ చూసింది. దాంతో వెంటనే కోపం పతాక స్దాయికి వెళ్లింది. తన భర్తకు ఫోన్ చేసి చెడామడా తిట్టేసింది. దాంతో ఏం చెప్పాలో అర్దం కాక గురుమీత్ చౌదరి వెంటనే సర్పైజ్ వెకేషన్ కు ప్లాన్ చేసి కూల్ చేసే ప్రయత్నం చేసాడు.

   భార్యని శాంతపరచటానికే

  భార్యని శాంతపరచటానికే

  తన కెరీర్ కు క్రేజ్ తెస్తుందని భావించిన ఈ ట్రైలర్ తన కాపురంలో చిచ్చు పెడుతుందని భావించలేదని వాపోతూ గోవాకు తన ఫ్యామిలీని తీసుకు వెళ్లాడు. అక్కడ కాళ్లు పట్టుకున్నంత పనిచేస్తే కానీ ఆమె శాంత పడలేదని మీడియాలో రకరకాల కథనాలు రాస్తున్నారు. అది కేవలం నటనే అని ఆమెకు ఒప్పించలేక నానా ఇబ్బందులు పడుతున్నాడట.

  కుర్రాళ్ల మతిపోగెట్టే సీన్స్

  కుర్రాళ్ల మతిపోగెట్టే సీన్స్

  విశాల్‌ పాండ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సనాఖాన్‌, షర్మన్‌ జోషీ, గురుమీత్‌ ఛౌదరి, రజినీశ్‌ దుగ్గల్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్‌లోని శృంగార సన్నివేశాల్లో సనాఖాన్‌ చాలా హాట్‌గా కనిపించి కుర్రాళ్ల మతి పోగొట్టింది. ముద్దు సీన్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

  టీవి లైవ్ లో హత్యచేయటం పై

  టీవి లైవ్ లో హత్యచేయటం పై

  సినిమాలో రజనీశ్‌ దుగ్గల్‌ టీవీ ఛానల్‌ యజమానిగా, శర్మన్‌ జోషి పోలీసు అధికారిగా, గుర్మీత్‌ ఛౌదరి, సనాఖాన్‌లు న్యాయవాదులుగా కనిపిస్తున్నారు. ఓ వ్యక్తి హత్యను టీవీల్లో ప్రసారం చేసిన నేపథ్యంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

  మొగుడుగారు ఏమంటారంటే..

  మొగుడుగారు ఏమంటారంటే..

  ఈ విషయమై గుర్నీత్ ఏమంటాడంటే.. ఇదంతా నా అబిమానులని, డబ్బు పెట్టి టిక్కెట్ కొనుక్కున్న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయటంలో ఓ భాగమే అని ఎందుకు అర్దం చేసుకోరు. నన్ను నేను రీ ఇన్వెంట్ చేసుకుని, కొత్తగా కెరీర్ ని డిజైన్ చేసుకునే ప్రయత్నమే ఈ సినిమా అన్నారు.

  అబ్బ ఏం మాట్లాడవమ్మా...నువ్వు మామూలు నటివి కాదు

  అబ్బ ఏం మాట్లాడవమ్మా...నువ్వు మామూలు నటివి కాదు

  ఆ సినిమాలో అందాల విందు గురించి తొలిసారిగా స్పందిస్తూ బోల్డ్‌గా మాట్లాడింది. ‘మన సినిమాలు హాలీవుడ్‌ స్థాయికి వెళ్లాలనుకుంటాం. కానీ, ఆ స్థాయిలో గ్లామర్‌స్థాయిని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం. మన ఆలోచనావిధాన్నాన్ని మార్చుకోవాల్సిన అవసరముంద'ని చిన్నపాటి లెక్చర్‌ దంచింది సనాఖాన్

  నో ప్లాబ్లం..రాధికా ఆప్టేనే ఆదర్శం

  నో ప్లాబ్లం..రాధికా ఆప్టేనే ఆదర్శం

  అది సరే, హాలీవుడ్‌ స్థాయిలో వెండితెరపై నగ్నంగా దర్శనమివ్వగలరా? అని సనాఖాన్ అడిగితే.. ‘వై నాట్‌? ఓ నటిగా నగ్నంగా కనబడడానికి నేను సిద్ధమే. అందులో తప్పేముంది. ఇటీవల వచ్చిన 'పర్చేద్‌' సినిమలో రాధికా ఆప్టే నగ్నంగానే కనిపించింది కదా' అంటూ ఘాటుగా బదులిచ్చింది.

  నేను ఒక్కదాన్నే మొదటి సారి చేసినట్లుగా.

  నేను ఒక్కదాన్నే మొదటి సారి చేసినట్లుగా.

  సనాఖాన్ ఈ విషయాన్ని లైట్ తీసుకుంటోంది. ఈ రోజు ప్రతీ సినిమాలోనూ కిస్ సీన్స్, హగ్గింగ్ సీన్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు నేను చేసినప్పుడే ఎందుకింత అల్లరి చేస్తున్నారో అర్దం కావటంలేదు. ఇంటిమేట్ సీన్స్ కూడా సినిమాల్లో ఓ భాగమే అని అర్దం చేసుకోండి అంటోంది .

  ఏంటి ఆ సీన్స్ కూడా కథలో భాగమేనా...

  ఏంటి ఆ సీన్స్ కూడా కథలో భాగమేనా...

  బాలీవుడ్ లో వచ్చే అనేక సినిమాల్లో ఇలాంటి హాట్ సీన్స్ బోల్డుగా బోల్డు ఉంటున్నాయి. వాటిని ఎవరూ క్వచ్చిన్ చెయ్యరు. నేను మాత్రం చేసిన సీన్స్ కథలో భాగం మాత్రమే. ఆ స్టోరీ ఇంటిమేట్ సీన్స్ ని డిమాండ్ చేసింది. అయినా ఈ రోజున మనమంతా వెస్ట్రన్ కల్చర్ కు ఓపెన్ అయ్యి ఉన్నాం అనే సంగతి మర్చిపోకండి అని వివరణ ఇచ్చేసింది.

  ఇంతకు ముందు నన్ను టార్గెట్ చేసారు

  ఇంతకు ముందు నన్ను టార్గెట్ చేసారు

  నేను ఈ సినిమాను సైన్ చేసేటప్పుడు నిన్ను ఫలానా నటిగా కేటరిలోకి తోసేసి జమకట్టేస్తారు అని అంతా అన్నారు. ఇప్పుడు ఇలా అనటం కొత్తేం కాదు. ఇంతుకు ముందు కూడా నేను బిగ్ బాస్ షో లో ప్రవేశించినప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. ప్రతీ నటికి ఓ డిఫెరెంట్ జర్నీ ఉంటుంది. నేను ఏది చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించే చేస్తాను. నా కెరీర్ కు ప్లస్ అవుతుందనే ముందుకు వెళ్తాను. నేను అన్ని విధాలా ఆలోచించి చేస్తున్న ఈ సినిమాపై నాకు రిగ్రెట్ లేదు.

  సెక్స్ సీన్స్ మాత్రమే కాదు

  సెక్స్ సీన్స్ మాత్రమే కాదు

  ఈ సినిమా ట్రైలర్ చూసి మీరేదో కథ ఊహించుకుంటే ఎలా. ఈ సినిమా లో కేవలం అలాంటి సన్నివేశాలు మాత్రమే కాదు. ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూ ట్విస్ట్ లు, టర్న్ లతో ముందుకు వెల్తుంది. మేము సినిమా చూస్తే భలే ఉందే అంటూ ఎంజాయ్ చేస్తారు. అయినా ఇలాంటి సినిమా చేయటంలో తప్పేముంది అంటున్నారు హీరోగారు.

  ఇంతకు ముందు కూడా ఇలాంటి సీన్స్ అప్పుడు

  ఇంతకు ముందు కూడా ఇలాంటి సీన్స్ అప్పుడు

  దేబిక తన భర్తతోనూ, భర్తతో నటించే తోటి ఆర్టిస్ట్ లతోనూ గొడవ పడటం మొదటి సారి కాదట. గతంలోనూ తన భర్తతో ఇంటిమేట్ సీన్ లలో నటించిన హీరోయిన్ తో గొడవ పడిందట. కాబట్టి ఆమె తత్వమే అంత. నటనను నటనగా తీసుకోదు ఆమె. చిన్న విషయాన్ని పెద్దది చేస్తోంది అని అంటున్నారు ఆ సినిమా టీమ్ .

  ఈ ట్రైలరే కాపురంలో చిచ్చు పెట్టింది

  ఫ్రం ది మేకర్స్ ఆఫ్ 'హేట్ స్టోరీ 2 & 3' అని గ్రాండ్ గా అనౌన్స్ చేస్తూ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లో ఏముంది. అంతగా గొడవపడటానికి, కాపురంలో చిచ్చుపెట్టడానికి అంటారా...ఇదిగో ఇక్కడ ఇస్తున్నా. మీరే చూసి డిసైడ్ చేయండి.

  English summary
  We all have watched the bold trailer of Wajah Tum Ho and we all know that the movie has many s*x scenes. But it seems that Debina Choudhary, who is the wife of Gurmeet Choudhary is very angry after seeing her hubby's erotic scenes with Sana Khan.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more