»   » వెంకీ తొలిసారి పాడారు: ‘గురు’ మూవీ జింగిడి సాంగ్ (మేకింగ్ వీడియో)

వెంకీ తొలిసారి పాడారు: ‘గురు’ మూవీ జింగిడి సాంగ్ (మేకింగ్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ కెరీర్లో తొలిసారిగా పాట పాడారు. ప్రస్తుతం ఆయన సుధ కొంగర దర్శకత్వంలో 'గురు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆయన 'జింగిడి జింగిడి' అనే పాట పాడారు. ఇందుకు సంబంధించిన సాంగ్ మేకింగ్ వీడియోను సోమవారం విడుదల చేసారు.

వెంకటేష్ పాడిన పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'గురు' ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ బాక్సింగ్‌ కోచ్‌గా నటిస్తున్నారు.రితిక సింగ్, ముంతాజ్ సర్కార్ లు ఈ చిత్రం లో వెంకటేష్ తో పాటు ప్రధాన పాత్రలను పోషిస్తారు. రితిక సింగ్ ఇటీవలే ఉత్తమ నటి క్యాటగిరి లో నేషనల్ అవార్డు ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ముంతాజ్ సర్కార్ విషయానికి వస్తే, ఆమె సుప్రసిద్ధ మాంత్రికులు పి . సి. సర్కార్ కుమార్తె.


స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఉండే ఈ స్పోర్ట్స్ డ్రామా ను వేసవి సెలవుల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధపడుతోంది. తమిళంలో మాధవన్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం 'ఇరుది సుట్రు' చిత్రాన్ని తెలుగులో వెంకీతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Watch Jingidi Song Making, sung by Venkatesh For Guru Telugu Movie. Guru is an upcoming Telugu film written and directed by Sudha Kongara Prasad which features Daggubati Venkatesh in the lead role. It is a remake of director's own Tamil film Irudhi Suttru (2016). Production began in January 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu