లాక్‌డౌన్ విధిస్తారని 3 నెలల ముందే తెలుసు.. బాంబు పేల్చిన గుత్తా జ్వాలా
కరోనావైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధిస్తారనే విషయం మూడు నెలల క్రితమే తెలుసునని బాడ్మింటన్ క్రీడాకారిణి, సినీ నటి గుత్తా జ్వాలా బాంబు పేల్చింది. చైనాలోని షాంఘైలో ఉన్న మా అంకుల్ అక్కడి పరిస్థితిని డిసెంబర్‌లోనే మా దృష్టికి తీసుకొచ్చారు. వుహాన్‌లోని దారుణ పరిస్థితులు మాకు అప్పుడే తెలిశాయి. దాంతో ఇండియాలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించి.. నేను మానసికంగా ముందే ప్రిపేర్ అయ్యాను.
అయితే నా ప్రియుడిని నుంచి ఇలా దూరమవుతానని మాత్రం ఊహించలేదు. ఇలా సుదీర్ఘంగా దూరం ఉంటానని ఊహించగలిగితే ముందే జాగ్రత్త పడేదానిని అని గుత్తా జ్వాలా అన్నారు. మూడు నెలలుగా ఆయనను చూడలేదు. కలువలేదు. గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నాను. కానీ ఇలా ఇన్ని రోజులు ఆయనకు దూరంగా ఉండలేదు అని గుత్తా జ్వాలా అన్నారు.

క్వారంటైన్ సమయంలో ఇంట్లో ఉండటం చాలా బోర్‌గా ఉంది. కానీ పేద ప్రజల గురించి ఆలోచిస్తే గుండె తరుక్కుపోతున్నది. లాక్‌డౌన్ కారణంగా రోజువారి కూలీల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించుకొంటేనే బాధగా ఉంది అని గుత్తా జ్వాలా ఆవేదన వ్యక్తం చేశారు.
కొద్ది రోజుల క్రితం తన ప్రియుడు, తమిళ నటుడు విష్ణు విశాల్‌తో ఎడబాటు భరించలేకపోతున్నాను అంటూ ట్వీట్ చేయడం మీడియాలో హైలెట్‌గా మారింది. తన ప్రియురాలు బాధపడుతున్న విషయాన్ని గ్రహించిన ఆయన.. దేశ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని రోజులు అలా దూరంగా ఉందాం అని విష్ణు విశాల్ సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











