twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డేటింగ్ చేస్తున్నా.. అన్ని కుదిరితే పెళ్లి చేసుకొంటా.. విష్ణు విశాల్‌తో జ్వాలా గుత్తా

    |

    కరోనావైరస్ కారణంగా ప్రేమికులు ఎంత విరహా వేదనను అనుభవిస్తున్నారో.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా చేసిన ట్వీట్ చూస్తే అసలు విషయం బోధపడుతుంది. తాజాగా ఆమె హైదరాబాద్‌లో.. ఆమె ప్రియుడు చెన్నైలో ఉంటూ ట్విట్లతో రొమాన్స్ చేస్తున్నారు. అయితే తమిళ యాక్టర్ విష్ణు విశాల్‌తో రిలేషన్‌పై క్లారిటీ ఇస్తూ..

    అన్ని కుదిరితే..

    అన్ని కుదిరితే..

    విష్టు విశాల్‌తో డేటింగ్ చేస్తున్నాను. ఇందులో దాచాల్సిన అవసరం ఏమీ లేదనుకొంటాను. అన్నీ కుదిరితే త్వరలోనే పెళ్లి చేసుకొంటాను. డేట్లు ఫిక్స్ అయితే వెంటనే ప్రకటిస్తాం. పెళ్లికి ఏర్పాట్లు చేసుకొంటాం అని జ్వాలా గుత్తా ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    మిస్ అవుతున్నాను అంటూ

    మిస్ అవుతున్నాను అంటూ

    తాజాగా జ్వాలా గుత్తా తమకు సంబంధించిన హాట్ ఫోటోలను ట్వీట్ చేస్తూ.. నీకు దూరంగా ఉండటం కష్టంగా ఉంది. నిన్ను మిస్ అవుతున్నాను అంటూ ట్వీట్ చేస్తే.. విష్ణు విశాల్ రిప్లై ఇస్తూ.. ఇలాంటి సమయంలోనే నిగ్రహంగా ఉండాలి. ప్రస్తుతం సమయంలో సోషల్ డిస్టెన్స్ అతి ముఖ్యం. మనం జాగ్రత్తగా ఉంటూనే అందరూ బాగుండాలని భగవంతుడిని ప్రార్థించాలి అంటూ ట్వీట్ చేశారు. దాంతో వీరిద్దరూ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

     చేతన్ ఆనంద్‌కు విడాకులు

    చేతన్ ఆనంద్‌కు విడాకులు

    ఇక జ్వాలా గుత్తా వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2005లో బాడ్మింటన్ ఆటగాడు చేతన్ ఆనంద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. 6 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత వారిద్దరూ పరస్పర అవగాహనతో విడిపోయారు. అప్పటి నుంచి జ్వాలా బాడ్మింటన్‌తోపాటు తెలుగు తెరపై అదృష్టాన్ని పరీక్షించుకొనే పనిలో ఉన్నారు.

    భార్యకు విడాకులు

    భార్యకు విడాకులు

    ఇక విష్ణు విశాల్ విషయానికి వస్తే.. ఇటీవల ఏడేళ్ల దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పారు. తాను ప్రేమించి పెళ్లి చేసుకొన్న రజిని నుంచి ఇటీవలే విడాకులు తీసుకొన్నారు. అయితే విడిపోయినా స్నేహితులుగానే ఉండాలని నిర్ణయించుకొన్నాం అని తెలిపారు.

    వరుస చిత్రాలతో

    వరుస చిత్రాలతో

    విష్ణు విశాల్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం కాదన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించిన అరణ్య చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా జగజాల కిలాడీ, ఎఫ్ఐఆర్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన రాక్షసుడు చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది.

    English summary
    Badminton Player Gutta Jwala, Actor Vishnu Vishal affair is not hot topic in south industry. Jwala tweet to Vishnu Vishal: I miss you in corona Lockdown.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X