twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు సాంగ్ టైటిల్ గా..ఎట్రాక్షన్ కోసమా? తెగ చూస్తున్నారే (వీడియో)

    ‘గువ్వా గోరింకతో...’ వినగానే చిరంజీవి సాంగ్ గుర్తుకు వస్తుంది. కానీ ఓ కథ ని ఈ టైటిల్ తో ప్రెజెంట్ చేసి చిన్న షార్ట్ స్టోరీ గా అందచేసారు.

    By Srikanya
    |

    హైదరాబాద్ : అప్పట్లో చిరంజీవి హీరోగా వచ్చిన 'ఖైదీ నెబర్ 786' సినిమాలో 'గువ్వా గోరింకతో...' అనే పాట సెన్సేషనల్ హిట్. ఇప్పుడు మళ్లీ ఆ పాటను గుర్తు చేసుకునే సమయం వచ్చింది. అయితే ఈ సారి ఓ షార్ట్ ఫిలిం కు 'గువ్వా గోరింకతో...' టైటిల్ పెట్టారు. టైటిల్ తోనే ఎట్రాక్ట్ చేయటమే కాకుండా, కంటెంట్ పరంగా ఆ స్దాయి సత్తా ఉన్న సబ్జెక్టుతో వచ్చిన షార్ట్ పిలిం ను పరిచయం చేస్తున్నాం.

    షార్ట్ ఫిలిమే కదా అని చిన్న చూపు చూసే రోజులు తెలుగు పరిశ్రమలో మెల్లిగా పోతున్నాయి. ముఖ్యంగా ఉయ్యాల జంపాల, పెళ్లి చూపులు వంటి చిత్రాలు తీసిన దర్శకులు షార్ట్ ఫిలింలతో నే తమ ప్రస్దానం మొదలెట్టడం షార్ట్ ఫిలిం దర్శకులపై ఓ గౌరవం కలగచేస్తోంది. యూత్ సైతం తమకు కనెక్ట్ అయ్యే సబ్జెక్టు లతో వచ్చే షార్ట్ ఫిల్మ్ లను ఎంకరేజ్ చేస్తూండటంతో... సినిమా నిర్మాతల దృష్టీ వీరిపై పడుతోంది.

    Guvva Gorinka Tho: It's all about a love story of an Young man

    అయితే షార్ట్ ఫిలిం మన చేతిలో పనే కదా అని ఆషామాషీగా తీసేస్తూంటే ఇబ్బంది వస్తోందే. సరైన అవగాహనతో, సరికొత్త అయిడియాతో,బలమైన ముద్ర వేసేలా తీస్తున్న వారికి మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. మీడియాలో కన్నా ముందు వీరు సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు.వారి భవిష్యత్ లో వచ్చే అవకాశాలకు ఇది కాలింగ్ కార్డ్ లా ఉపయోగపడుతోంది.

    ప్రపంచవ్యాప్తంగా ఫెస్టివల్స్ సర్క్యూట్ కు, లేదా ఏదైనా కమర్షియల్ వర్క్ తెచ్చి పెట్టేందుకు అది మీకు ఉపయోగపడుతోంది. అలాంటి ఓ షార్ట్ ఫిలిం ఒకటి రీసెంట్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి కుర్రకారుని ఆకట్టుకుంటోంది. గువ్వా గోరింకతో అనే టైటిల్ తో రూపొందిన ఆ షార్ట్ ఫిలిం ను మీకు ఇక్కడ అందచేస్తున్నాం.

    పెళ్లికు ముందు కావచ్చు...లేదా పెళ్లి తర్వాత కావచ్చు...ఒక జంట కి చాలా వరకూ మిస్ అండర్ స్టాండింగ్స్ , బ్రేకప్ లు అయ్యేది మేజర్ గా వేరే వ్యక్తుల ప్రభావంతోనే. ఆడవాళ్లు అయితే తల్లి ఇన్ఫూలియన్స్ తో చాలా వరకూ భర్తల కి మనశ్సాంతి లేకుండా చేస్తూంటారని చెప్తూంటారు. అలాగే అవగాహన లేని స్నేహితుల ప్రభావం కూడా మన రిలేషన్ షిప్ పై పడుతుందనే చిన్న విషయాన్ని ఎంతో అర్దవంతంగా ఈ దర్శకుడు చెప్పగలగటం స్పెషాలిటీ.

    అలాగే షార్ట్ ఫిలిం ప్రారంభంలోనే చాలా ఇంట్రస్టింగ్ గా మొదలెట్టారు. అక్కడే మనం ప్లాట్ అయ్యిపోతాం. షార్ట్ ఫిలిం కాస్త లెంగ్త్ ఎక్కువ అనిపించినా చివరి దాకా చూడాలని ఫిక్స్ అవుతాం.

    యే కపుల్ అయినా..యే రిలేషన్ అయినా వేరే వాళ్ల ఇన్ఫూలియన్స్ కాకుండా , ఇగో అనేది ప్రక్కన పెడితే..డెఫినెట్ గా చాలా రిలేషన్స్ లో సమస్యలు అనేవి రావు. అదే విషయాన్ని ఈ షార్ట్ ఫిలింలో చాలా క్లియర్ గా గ్లాసీగా చెప్పారు దర్శకుడు కళ్యాణ్ సి బడుగు. అతనికి డైలాగుల్లో నేచురాలిటితో కూడీన ఫన్ ఉంది. విషయాన్ని సూటిగా చెప్పే నేర్పు కనపుడుతోంది.

    అలాగే ఆ షార్ట్ ఫిలింలో చేసిన ఆర్టిస్ట్ లు వంశీ ఆలూరు, ధర్తి త్రివేది, అశోక్ కుమార్ ఆలారూ, సాయినాధ్ వంగూరి, చిన్నపిల్లవాడు ఇలా అందరూ చక్కగా చేసారు. ఇంకా చెప్పాలంటే దర్శకుడు వీరి నుంచి మంచి నటన రాబట్టుకున్నాడు. వీరంతా ప్రొఫిషనల్స్ గా తెరపై కనపడ్డారంటే అది దర్శకుడు ప్రతిభే అని చెప్పాలి.

    ఇక టెక్నికల్ గా ఈ షార్ట్ ఫిలిం కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. బాహుబలి సింగర్ సత్య యామిని పాడిన పాట హంట్ చేస్తుంది. టోటల్ గా దర్శక,రచయిత కళ్యాణ్ సి బడుగు కు మంచి భవిష్యత్ ఉందని అర్దమవుతుంది.

    English summary
    Guvva Gorikatho is a cute love story based on relationships and Break up's of today's youth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X