»   » మహేష్ గ్లో చూసి అబ్బాయిలే ప్లాట్ అయిపోతున్నారా..మరి అమ్మాయిలు..!?

మహేష్ గ్లో చూసి అబ్బాయిలే ప్లాట్ అయిపోతున్నారా..మరి అమ్మాయిలు..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబులో ఈ మధ్య చాలానే మార్సులొస్తున్నాయి. ఫేస్ లో పెరుగుతున్న గ్లో చూసి అబ్బాయిలే మనసు పారేసుకుంటున్నారీమద్య. దానికి కారణం వేరోదో కాదు. బద్దకిస్ట్ అయిన మహేష్ ఈ మధ్య జస్ట్ కాసేపు జిమ్ లో గడుపుతున్నాడు. 'ఖలేజా" ఇచ్చిన షాక్ తో వెంటనే 'దూకుడు" ప్రారంభించిన మహేష్ వెంట వెంటనే సినిమాలు చెయ్యాలని డిసైడ్ అయిపోయాడు. అయితే దూకుడు తర్వాత చెయ్యబోయే సినిమాలు పూర్తిగా తమిళ మాస్ మసాలాగా వచ్చేలా వున్నాయి.

శంకర్ రీమేక్ చేస్తున్న త్రీ ఇడియట్స్ తెలుగు వెర్షన్ లో మహేష్ తప్ప అందరూ తమిళ ఆర్టిస్టులే. తర్వాత చేసే సినిమా కూడా తమిళ డైరెక్టర్ తోనే. లింగుస్వామి డైరెక్షన్ లో 'వేట" అనే చిత్రంలో నటిస్తున్నాడు మహేష్. ఖలేజా తర్వాత అనుష్కతో మరోసారి రొమాన్స్ చెయ్యబోతున్నాడు మహేష్. మరో హీరోయిన్ గా సమీరా రెడ్డిని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ టైమ్ మహేష్ తమిళ డైరెక్టర్స్ తో ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ తెలుగు, తమిళ భాషల్లో రూపొందడం విశేషం. వేట తమిళ వెర్షన్ లో ఆర్య హీరోగా నటిస్తుండగా, త్రీ ఇడియట్స్ తమిళ వెర్షన్ లో విజయ్ హీరోగా చేస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలు మహేష్ కి ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో వేచి చూడాల్సిందే..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu