ఐశ్వర్య రాయ్ కొత్త చిత్రంపై కాపీ అపవాదు!!
ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన చిత్రం గుజారిష్. ఈ చిత్రం ప్రోమోలు రీసెంట్ గా విడుదల అయ్యాయి. దాంతో పాట దర్సకుడు సంజయ్ లీలా భన్సాలీ అసలు సినిమాకు గుజారిష్ అనే పేరు ఎందుకు పెట్టామన్న విషయాన్ని చెప్పారు. శరీరం చచ్చుబడిపోయిన ఓ యు వకుడు తనకు మరణభిక్ష పెట్టాలని కోరుకోవడం ఈ సినిమా మూల కథ అన్నారు. దాంతో ముంబై సినీ సర్కిల్లో ఇదో కాపీ సినిమా అంటూ ప్రచారం మొదలైంది. 2004లో విడుదలైన 'ద సీ ఇన్‌సైడ్' అనే స్పానిష్ సినిమా కథ కూడా అచ్చం ఇదే అని వారు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. ఇక దసీ ఇన్ సైడ్ ని రాండన్ శాంప్రెడో అనే నావికుడి జీవిత గాథ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇక సంజయ్ లీలా భన్సాలీ గతంలో బ్లాక్ చిత్రాన్ని మిరాకిల్ వర్కర్ ని కాపీ కొట్టి తీసాడు కాబట్టి ఇది కూడా ఆ కోవలోదే అని వాదిస్తున్నారు. అయితే హృతిక్ రోషన్ మాత్రం చాలా హ్యాపీగా ఎంతో ఇష్టపడి చేసిన చిత్రం అని చెప్తున్నారు. ఇందులో ఆయన ఇంద్రజాలికుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఐశ్వర్య రాయ్ తన భర్త నుంచి విడిపోయిన ఓ నర్సు పాత్రలో కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కథకు బలాన్ని చేకూరుస్తాయని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











