మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ పెళ్లి డేట్ ఫిక్సయింది

By Bojja Kumar

చెన్నై: ఏఆర్ రెహమాన్ మేనల్లుడైన సంగీత దర్శకుడు జివి ప్రకాష్ తన స్నేహితురాలు, గాయని సైంధవిని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి వివాహం ముహూర్తం ఖరారైంది. జూన్ 27న చెన్నైలో వీరి వివాహం జరుగనుంది. వీరిద్దరు పాఠశాల స్థాయి నుంచే మంచి స్నేహితులు. ఇద్దరి అభిరుచులు ఒక్కటే. ఇద్దరూ కలిసి సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు.

జివి ప్రకాష్ విషయానికి వస్తే... 19 ఏళ్లకే సంగీత దర్శకుడిగా పరిచయం అయి అతి చిన్న వయస్సులోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రజనీకాంత్ చిత్రం కథానాయకుడుకి కూడా ఇతనే సంగీతం అందించటం విశేషం. అలాగే తెలుగులో కరుణాకరన్.. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి, ప్రభాస్ డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త చిత్రాలకు సంగీతం సమకూర్చారు.

ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో దాదాపు 30కిపైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ప్రస్తుతం అతను సంగీతం అందిస్తున్న సినిమా సిద్ధార్థ హీరోగా రూపొందుతున్న ఎన్‌హెచ్ 4. సైంధవి విషయానికొస్తే తెలుగులో ఆమె మామిడి కొమ్మకి... (ఆవకాయ బిర్యాని), ఎలగెలగ(పరుగు) చిత్రాలుకు పాడింది. ఆమెకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ గాయనిగా గతంలో సత్కరించింది కూడా.

తమ వివాహం గురించి జీవీ ప్రకాష్ మాట్లాడుతూ 'మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నాం. సైంధవి నాకు స్కూల్ డేస్ నుంచి మంచి స్నేహితురాలు. అలాగే గత పదేళ్లుగా ఇద్దరం ఒకరికొకరు బాగా తెలుసున్నవాళ్ళం. ఈ మధ్యనే మా ఇద్దరు తల్లి తండ్రులు కలిసి మాట్లాడుకుని వివాహం నిశ్చయించారు' అని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X