మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా మారితే ఇలా..(ఫస్ట్ లుక్ ఫోటోలు)
చెన్నై: నెం.1 మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వారసత్వం పునికి పుచ్చుకున్న ఆయన అల్లుడు జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాప్ 10 లిస్టులో కొనసాగుతున్నారు. ఇటీవలే తన ప్రియురాలు సైంధవిని పెళ్లాడిన జీవీ ప్రకాష్ ప్రస్తుతం ఇటు కెరీర్ ను, అటు లైఫ్ ను ఎంతో హ్యాపీగా సాగిస్తున్నాడు.
ఇప్పటి వరకు తెర వెనక ఉండి సంగీతం అందించిన జీవీ ప్రకాష్ త్వరలో 'పెన్సిల్' అనే చిత్రంలో హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి గౌతం మీనన్ దగ్గర అసోసియేట్ గా పని చేసిన మణి నాగరాజు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ ఇంటర్మీడియట్ కుర్రాడిగా నటిస్తున్నాడు. అతని శ్రీదివ్య నటిస్తోంది.
తాజాగా 'పెన్సిల్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఫోటోలు విడుదలయ్యాయి. వాటిపై ఓ లుక్కేయండి...

రొమాంటిక్ థ్రిల్లర్
జీవి ప్రకాష్, శ్రీదివ్య జంటగా మణినాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నీ ఈ చిత్రం రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరక్కుతోంది.

భార్య కండీషన్లు
హీరోగా తెరంగ్రేటం చేయబోతున్న తన భర్తకు చాలా కండీషన్లు పెట్టిందట జీవీ ప్రకాష్ భార్య సైంధవి.

ముద్దులు వద్దంది
‘నేను హీరోగా మారుతానంటే ఒప్పుకుంది కానీ...హీరోయిన్లతో ముద్దు సీన్లు, హాట్ సీన్లు మాత్రం చేయడానికి వీళ్లేదు అని నా భార్య కండీషన్లు పెట్టింది.' అని జీవి ప్రకాష్ చెప్పుకొచ్చాడు.

సంగీతంలో కొనసాగుతాడట
అయితే తాను హీరోగా మారిన తర్వాత సంగీత ప్రపంచానికి దూరం అవుతానని మాత్రం ఊహించుకోవద్దు అని జీవీ ప్రకాష్ చెప్పుకొచ్చారు.

సంగీతమే సర్వస్వం
సంగీతమే నా సర్వస్వం. నటనా రంగంలో ఎంతకాలం ఉంటానో తెలియదు కానీ.... లైఫ్ లాంగ్ సంగీత దర్శకుడిగా కొనసాగుతూనే ఉంటాను అని జీవి ప్రకాష్ స్పష్ట చేసారు.


Click it and Unblock the Notifications











