బాలీవుడ్ ఎంట్రీఇస్తున్న మరో తెలుగు దర్శకుడు
ఈ చిత్రం విశేషాలను జీవీ తెలియజేస్తూ...'ఉత్తర ప్రదేశ్, బీహార్ సరిహద్దుల్లో జరిగిన ఓ యదార్థ సంఘటన నేపథ్యంలో ఈ కథ తయారు చేసుకున్నా. కథ విని అనిల్ కపూర్, నానా పాటేకర్ వెంటనే ఓకే చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ సరిహద్దు ప్రాంతాల్లోనే చిత్రీకరణ జరపనున్నాం. నేను పన్నెండేళ్లు ఢిల్లీలో చదువుకోవడంతో హిందీ బాషపై పట్టుఉంది' అని చెప్పుకొచ్చారు జీవీ.
నిర్మాతలు కుమార్, సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ...'ప్రస్తుతం బాలీవుడ్లో మన తెలుగు సినిమాలపై మంచి క్రేజ్ ఉంది. ఇక్కడి చాలా కథలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు దర్శకుడైన జీవీకి ఈ అవకాశం వచ్చింది. స్క్రిప్టు పర్ ఫెక్టుగా కుదిరింది. హేమామాలిని, రేఖతో పాటు యంగ్ హీరో హీరోయిన్లు కూడా ఇందులో నటిస్తారు. త్వరలోనే చిత్రీకరణ మొదలు పెడతాం' అని తెలిపారు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : ఎంఎం అజీమ్, లైన్ ప్రొడ్యూసర్స్ : బాలాజీ, మధు.


Click it and Unblock the Notifications
