రానా కొత్త గెటప్: 'హాథీ మేరే సాథీ' ఫస్ట్ లుక్.. డీ-గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నాడా?

తెలుగు చిత్ర సీమలో రానా జర్నీ మిగతా వాళ్ల కన్నా భిన్నమనే చెప్పాలి. హీరోగా తెరంగేట్రం చేసినప్పటికీ.. అదే ఇమేజ్‌లో ఇరుక్కుపోకుండా తనకు సూట్ అయ్యే పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా.. హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తూ అక్కడివాళ్లను కూడా మెప్పిస్తున్నాడు.

రానా నటిస్తున్న తాజా చిత్రం 'హాథీ మేరే సాథీ'. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు ప్రభు సోలోమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. బాందేవ్ అనే పాత్రలో ఆకట్టుకునే లుక్‌లో కనిపిస్తున్న రానా.. సినిమాపై ఎటెన్షన్ క్రియేట్ చేశాడు.

డీ-గ్లామర్‌ లుక్..:

'హాథీ మేరే సాథీ'లో రానా ఫస్ట్ లుక్ డిఫరెంట్ గా ఉందనే చెప్పాలి. ఇప్పటిదాకా ఆన్ స్క్రీన్ రానా ఎలా కనిపించాడో.. దానికి పూర్తి భిన్నంగా డీ-గ్లామర్‌గా కనిపిస్తున్నాడు. చూడబోతే.. మావటి పాత్రలో కనిపించబోతున్నాడేమో అనిపిస్తోంది.

 రాజేష్ ఖన్నా సినిమాకు రీమేక్..:

రాజేష్ ఖన్నా సినిమాకు రీమేక్..:

1971లో రాజేష్ ఖన్నా హీరోగా వచ్చిన 'హాథీ మేరే సాథీ' చిత్రానికి రీమేక్ ఈ తాజా చిత్రం. క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయిన ఈ చిత్రానికి ప్రభు సోలోమాన్ రీమేక్ ట్రీట్ మెంట్ ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి నెలకొంది.

 ఒకేసారి మూడు భాషల్లో..:

ఒకేసారి మూడు భాషల్లో..:

గతంలో తమిళంలో కుంకీ(గజరాజు) సినిమాను తెరకెక్కించిన ప్రభు సోలోమాన్.. ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఏనుగులతో చిత్రాలను తెరకెక్కించడానికి మొగ్గుచూపే ప్రభు.. ఈసారి రానాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. దీపావళి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కలిసొచ్చిన 2017:

కలిసొచ్చిన 2017:

బాహుబలి-2, ఘాజీ చిత్రాలతో 2017లో తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలు చేశాడు రానా. అలాగే నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకున్నాడు.

 విభిన్న చిత్రాలు..:

విభిన్న చిత్రాలు..:

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఓ చారిత్రక చిత్రంలో రానా నటిస్టున్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యంలో జరిగే ఓ సైనికుడి ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 1945 కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.

మలయాళంలో..:

మలయాళంలో..:

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న మరో పీరియాడికల్ డ్రామా చిత్రంలోనూ రానా నటిస్తున్నాడు. కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ పాత్రను రానా ఇందులో పోషించనున్నాడు. ఇక మలయాళంలోనూ ఓ చిత్రంలో నటిస్తుండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X