twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదేం పని?: 'పవనిజం జిందాబాద్' అంటూ హ్యాకింగ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఇప్పటికే ‘పవనిజం' పేరుతో బయిట,సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక ఆ పేరుతో సామాజిక కార్యక్రమాలు సైతం చేస్తున్నారు. ఆ మధ్యన అభిమాన సంఘాలన్నీ చర్చించుకుని అక్టబర్ 11వ తేదీని ‘వరల్డ్ పవనిజం డే'గా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి కూడాను. అయితే పవనిజం పేరును వాడుతూ కొందరు హ్యాకింగ్ లాంటివాటికి పాల్పబడటం మాత్రం అభిమానులను ఇబ్బంది పరుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

    విజయవాడలో ..'మీ కాలేజి వెబ్ సైట్ సెక్యూరిటీ సిస్టమ్ చాలా వీక్ గా ఉంది' అని హెచ్చరిస్తూ ఓ కాలేజి వెబ్ సైట్ ను బన్నీ పేరుతో హ్యాక్ చేయడమే కాకుండా పవనిజం జిందాబాద్ అంటూ ఓ సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. బన్ని పేరుతో విజయవాడ సమీపంలో మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజి వెబ్ సైట్ ను ఇటీవల హ్యాక్ చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    హ్యాకింగ్ పాల్పడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫోటోను పెట్టి పవనిజం జిందాబాద్ అనే సందేశాన్ని హోంపేజీలో పోస్ట్ చేశారు. 'మా వెబ్ సైట్ ను హ్యాక్ చేసినట్టు గమనించాం. ఇందుకు బాధ్యులైన వారిపై తర్వాత దృష్టిపెడుతాం' అని కాలేజి యాజమాన్యం ఓ దినపత్రికకు వెల్లడించారు.

    ప్రస్తుతం కాలేజి వెబ్ సైట్ ను పునరుద్దరించి.. యధావిధిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల కరెన్సీ నోటును ఫ్యాన్స్ మార్పింగ్ చేసి గాంధీజీ బొమ్మ స్థానంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను పెట్టడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇలాంటి వారిని పట్టుకుని పవన్ అభిమానులు సరైన బుద్ది చెప్పి...తమ పవనిజానికి మచ్చ రాకుండా ఉండాలని కోరుకుంటున్నారు.

    Hacks site says Pawanism Zindabad

    పవనిజం గురించి గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.....‘పవనిజం అంటే అదో అందమైన అభిమానుల ప్రపంచం. నా అభిమానులు నాకోసం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ఫంక్షన్లు చేయనక్కర్లేదు. నన్ను అభిమానించే అభిమానుల ప్రతి ఒక్కరి కళ్ళలోనూ చెరగని ఆనందాన్ని చూడాలనుకుంటాను. వాళ్ళు సమాజం పట్ల భాద్యత కలిగిన ఒక పౌరిడిగా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలనేది మాత్రమే వారి నుంచి ఆశిస్తున్నానని' ఆయన అన్నారు.

    గతంలో పవనిజం గురించి ఓ అభిమాని ఇలా రాసాడు...

    "పవన్" అంటే ఒక" నిజం" .. కలిపి చదివితే "పవనిజం " తన నిజమైన వ్యక్తిత్వమే ఇక్కడ ఆదర్శం తన మానవత్వమే ఇక్కడి మార్గం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ...మన పవనుడి పై ప్రేమ ను చూపిస్తాం తన ఫొటోస్ పెడతాం..తన గురించి ఏదైనా రాస్తాం అంటే మన ప్రేమ ఇంతవరకే పరిమితమా ...ఇంకేం చేయలేమా.... చేయగలం ..ఆలోచించండి ..

    మన ప్రేమ తో సమాజానికి ఏదైనా మంచి చేద్దాం .. మన ప్రేమకి ఉన్న పవర్ ఏంటో చూపిద్దాం .... ఒక పూట అన్నం తినకపోతే విలవిల లాడే ప్రాణం మనది.. అలాంటి జీవితాలు ఎన్నో, సమయానికి తిండి లేక .. తోటి మనుషుల ఆదరణ కరువై ప్రతి క్షణం ప్రాణం కోసం పోరాడుతున్నాయి.. ప్రతి రోజు కంటతడి పెడుతున్నాయి .. సాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్నాయి ... తప్పు ఎవరిదో తెలియదు కాని ప్రాణాలు పోతున్నాయి ... తల్లి ప్రేమ దూరమై పసి ప్రాణాలు తల్లడిల్లుతున్నాయి ఆకలి ని తీర్చుకోవడానికి తప్పుదారులు పడుతున్నాయి ఎన్నో జీవితాలు ఇలా బలి అవుతున్నాయి ..

    ఒక మనిషి బాధ ఇంకొక మనిషే కదా అర్థం చేసుకోగలడు అందుకే ... మన ప్రేమ ,అభిమానాలకి నిస్వార్థాన్ని చేరుద్దాం మానవత్వం అనే దారిలో పయనిద్దాం అనాధలని, ఆపదలో ఉన్న మనుషులని మన పవనిజం అనే సమాజంలోకి ఆహ్వానిద్దాం పవనిజం అనే ఆశ్రయాన్ని కల్పిద్దాం అనాధే ఇక్కడి తల్లి..అనాధే ఇక్కడి తండ్రి అనాధలే ఇక్కడి బిడ్డలు ..రండి బయలుదేరుదాం అనాధ అంటే "అందరి నేస్తం " అనే అర్థాన్ని తెద్దాం వారికి ఆత్మీయులుగా ఉందాం..

    పవనిజం అంటే పవనుడి అభిమానులకే కాదు అందరికోసం నిలిచి ఉంటుంది అని నిరూపిద్దాం మనమే ఇక్కడ హీరోలమౌదాం ... మన పవనిజం లోని పరమార్థాన్ని లోకానికి తెలియచేద్దాం ...మీరు సిద్దమేనా... అయితే ముందుకు రండి ..మనమేంటో ...మన పవనిజం లోని ప్రేమకున్న పవర్ ఏంటో చూపిద్దాం ...

    English summary
    A hacker, who uses the handle 'Bunny' hacked into a college website and defaced it with the message 'Pawanism Zindabad'! Officials of Lakireddy Balireddy College of Engineering in Mylavaram, near Vijayawada discovered on Tuesday that their college's home page was replaced with photographs of actor Pawan Kalyan by the hacker, who also left comments about the weak security of the site.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X