'హాయి హాయిగా' పాటల విడుదల
సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'హాయిహాయిగా'. పనోరమ పెంగ్విన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కె.ఇ.రాజు ప్రముఖ్, జయకృష్ణ నిర్మాతలు.సత్య మాట్లాడుతూ "ఈ చిత్రం ద్వారా అన్ని తరగతుల ప్రేక్షకులకు చేరువవుతాం. కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం'' అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ "పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు హాయిహాయిగా నవ్వుకుంటూ ఇంటికెళ్తారు'' అని చెప్పారు.
దర్శకుల సంఘం అధ్యక్షులు సాగర్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -''అన్ని వర్గాలకూ నచ్చే సినిమా ఇది. కామెడీ నేపథ్యంలో దీన్ని తీశాం'' అని చెప్పారు. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా వన్నెంరెడ్డి, స్వరకర్త మహర్షి, సూర్యప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications












