twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'హాయి హాయిగా' పాటల విడుదల

    By Srikanya
    |

    హైదరాబాద్: తొలి తెలుగు యానిమేషన్ చిత్రం 'కిట్టు' దర్శకుడు సత్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'హాయి హాయిగా'. పనోరమ పెంగ్విన్ ప్రొడక్షన్స్ పతాకంపై కాలేజ్ ప్రొఫెసర్లు కె.ఇ.రాజు ప్రముఖ్, జయకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.టి. ప్రసన్నకుమార్, వి.సాగర్ సంయుక్తంగా పాటల సీడీలను ఆవిష్కరించారు.

    సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'హాయిహాయిగా'. పనోరమ పెంగ్విన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కె.ఇ.రాజు ప్రముఖ్, జయకృష్ణ నిర్మాతలు.సత్య మాట్లాడుతూ "ఈ చిత్రం ద్వారా అన్ని తరగతుల ప్రేక్షకులకు చేరువవుతాం. కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం'' అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ "పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు హాయిహాయిగా నవ్వుకుంటూ ఇంటికెళ్తారు'' అని చెప్పారు.

    దర్శకుల సంఘం అధ్యక్షులు సాగర్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -''అన్ని వర్గాలకూ నచ్చే సినిమా ఇది. కామెడీ నేపథ్యంలో దీన్ని తీశాం'' అని చెప్పారు. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా వన్నెంరెడ్డి, స్వరకర్త మహర్షి, సూర్యప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Director B.Satya's Latest film Hai Haiga audio released in Hyderabad. Director says..it's a comedy film with a different twist.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X