ద్యావుడా! చూడలేక పోతున్నాం.... బాలీవుడ్ నటుడి పెళ్లి వేడుకపై సెటైర్లు! (ఫోటోస్)

By Bojja Kumar

పెళ్లి విషయంలో ఎవరైనా ముందుగాచూసేది ఈడుజోడు సరిగ్గా ఉందా? లేదా? అనే.....ఈ విషయంలో ఏదైనా తేడా ఉంటే వెంటనే సెటైర్లు పేలుతాయి. తాజాగా బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్-అంకిత కోన్వర్ పెళ్లిపై ఇలాంటి సెటైర్లే పేలుతున్నాయి. అఫ్ కోర్స్ వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నప్పటికీ చూసే జనాల్లో కొందరు మాత్రం వీళ్ల పెళ్లిని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకు కారణం మిలింద్ సోమన్ వయసు 52 ఏళ్లు కాగా, అంకిత కోన్వర్ వయసు కేవలం 25 లోపే ఉండటం. ఏప్రిల్ 21న అలీ బాగ్‌లో వీరి పెళ్లి వేడుక మొదలైంది.

పెళ్లి వేడుకలో మిలింద్-అంకిత జంట

పెళ్లి వేడుకలో మిలింద్-అంకిత జంట

పెళ్లి వేడుక సందర్భంగా మిలింద్ సోమన్, అంకింత కోన్వర్ ఇలా ఫోటోలకు ఫోజులుఇచ్చారు. పెళ్లి సందర్భంగా ఈ జంట పట్టలేని ఆనందంలో మునిగి తేలారు. డాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయబుల్ మూడ్లో కనిపించారు.

హ్యాపీ మూమెంట్స్

హ్యాపీ మూమెంట్స్

మిలింద్ సోమన్, అంకింత కోన్వర్ పెళ్లి వేడుకలో కొన్ని హ్యాపీ మూమెంట్స్. ఈ పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబాలకు చెందిన ముఖ్యమైన వ్యక్తులు, కొందరు బంధువులు మాత్రమే హాజరయ్యారు.

బ్రేకప్ రూమర్స్ కూడా

బ్రేకప్ రూమర్స్ కూడా

మిలింద్-అంకిత గత నాలుగేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. కొన్ని రోజుల క్రితం వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందనే వార్తలు సైతం వినిపించాయి. అయితే ఆ వార్తలను తోసి పుచ్చడంతో పాటు తమది విడదీయరాని బంధం అంటూ పెళ్లి తంతుతో అందరి నోళ్లు మూయించారు.

డాన్స్ వీడియో

పెళ్లి వేడుక సందర్భంగా మిలింద్ సోమన్, అంకింత కోన్వర్ డాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది.

మిలింద్-అంకిత పరిచయం ఇలా...

మిలింద్-అంకిత పరిచయం ఇలా...

‘నేను ఆమెను చెన్నైలో ఓ నైట్ క్లబ్‌లో కలిశాను. నేను అసలు నైట్ క్లబ్‌లకు వెళ్లాను... ఆ రోజు అనుకోకండా వెళ్లాను. అక్కడ ఒకరితో కలిసి డాన్స్ చేస్తున్న సమయంలో ఆమెను చూశాను, చూసిన వెంటనే నచ్చేసింది. మీకు ఇష్టం అయితే కాల్ చేయండి అని నా నెంబర్ ఇచ్చాను. తర్వాతి రోజు నాకు కాల్ చేసింది. అలా ఫిబ్రవరి 2014లో మా పరిచయం జరిగింది. అప్పటి నుండి ఒకరిపై ఒకరికి ఇష్టం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది అని మిలింద్ సోమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మిలింద్‌కు ఇది రెండో వివాహం

మిలింద్‌కు ఇది రెండో వివాహం

మిలింద్ సోమన్ 2006లో ఫ్రాన్స్ నటిని పెళ్లాడారు. అయితే 2009లో వీరు విడిపోయారు. ఆ తర్వాత అతడు పెళ్లి చేసుకోలేదు. తర్వాత కొందరు అమ్మాయిలతో సహజీవనం చేసి విడిపోయాడు. తాను మంచి భర్తగా ఉండలేను. నా జీవితానికి ఒక ప్యాటర్న్ అంటూ ఉండదు. అయితే నేను ఒక గ్రేట్ బాయ్ ఫ్రెండుగా మాత్రం ఉండగలను అని మిలింద్ సోమన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి అలాంటి వ్యక్తి మళ్లీ ఇపుడు రెండో పెళ్లికి సిద్దమవ్వడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X