»   » పవన్ తో అదరకొట్టనున్న హంస నందిని

పవన్ తో అదరకొట్టనున్న హంస నందిని

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తో హంసనందిని ఓ రేంజిలో డాన్స్ చేసి అదరకొట్టడానికి సిద్దమవుతోంది. పవన్ తాజా చిత్రం అత్తారింటికి దారేది లో ఆమె ఓ ఐటం సాంగ్ చేస్తోంది. ఈగ సినిమాలో సుదీప్ తో గెస్ట్ గా కనిపించిన ఆమె తర్వాత పూర్తి బిజీ అయ్యిపోయింది. దానికి తోడు మిర్చిలో ఆమె టైటిల్ సాంగ్ కి చేసిన డాన్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమెను త్రివిక్రమ్ ఎంపిక చేసినట్లు సమాచారం.

ఈ సాంగ్ కోసం హంసానందిని యుఎస్ లో ఉన్న ఆమె హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. మిర్చి తర్వాత ఆమెకు చాలా ఆఫర్స్ గెస్ట్ గా, ఐటం నెంబర్లకు వచ్చినప్పటికీ ఆమె వేటీనీ అంగీకరించలేదు. దాంతో ఆమెను ఈ పెద్ద ఆఫర్ వరించింది. పవన్ తో చేసే ఈ పాట పెద్ద హిట్ అవుతుందని..తన కెరీర్ ని అది మలుపు తిప్పుతుందని ఆమె భావిస్తోంది.

ఇక మరో ప్రక్క అత్తారింటికి దారేది' సినిమా లొకేషన్‌లో సమంత ఏడ్చినంత పనిచేసింది. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన చివరి పాట చిత్రీకరణ పూర్తయింది. ఈ పాటతో సమంత వర్క్ కూడా పూర్తయిపోయింది. ఈ చిత్రం యూనిట్‌ని వదిలి వెళ్లిపోవాల్సిన ఘడియ రాగానే సమంత భావోద్వేగానికి లోనయ్యారని చెప్తున్నారు.

ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తం 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'

English summary

 Hamsa Nandini who grabbed quite a few eye balls with her 'come hither' act in Eega, has been roped in to shake a leg for a "catchy song" in the Trivikram Srinivas directorial, tentatively titled Attarintiki Daredi. In fact, the actress flew down from the US to shoot for the dance number in Hyderabad, recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu